Begin typing your search above and press return to search.

ఈ దారుణం నిజంగా ప్రమాదమేనా లేక...

By:  Tupaki Desk   |   20 Dec 2016 8:20 AM GMT
ఈ దారుణం నిజంగా ప్రమాదమేనా లేక...
X
దేశ విదేశాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలైపోయాయి. ఈ క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ చేస్తున్న ప్రజలపైకి ఓ ట్రక్కు హఠాత్తుగా వచ్చి దూసుకుపోయింది. ఆ ప్రమాదంలో సుమారు 12 మంది మరణించగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రక్కు సృష్టించిన బీభత్సం నిజంగా ప్రమాధమేనా లేక ఉగ్రదాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దానికీ కారణాలు లేకపోలేదు. క్రిస్మస్ వంటి పండుగ దినాల్లో యూరప్ దేశాల్లో నరమేధానికి పాల్పడాలని ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాయని నిఘా ఏజెన్సీలు ముందే హెచ్చరించాయి.

అయితే ఈ భారీ ప్రమాదానికి కారకుడైన ఆ ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన చోట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశామని బహుశా అతడే ట్రక్కు డ్రైవర్ అని పోలీసులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే... ఇది ఉగ్రదాడి అని చెప్పే కారణాలు బలపడటానికి మరోకారణం కూడా వెలుగులోకి వస్తోంది. ఆఫ్గన్ శరణార్థి ఒకడు ఈ ట్రక్కు డ్రైవర్ ను హతమార్చి తానే వాహనాన్ని నడుపుతూ ఈ బీభత్సానికి పాల్పడ్డాడని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడే ఈ స్టీల్ సామాన్లతో నిండి ఉన్న ఈ వాహనాన్ని హైజాక్ చేసి అతి వేగంగా జనాల పైకి పోనిచ్చాడట. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ దుండగుడు జర్మనీ చేరుకున్నాడని తెలుస్తోంది.

అయితే ఉగ్రవాదులకు పుట్టినిళ్లు పాక్ అని ప్రపంచదేశాలకు దాదాపు తెలిసిన క్రమంలో ఈ దుండగుడు పాకిస్తానీ కూడా అయి ఉండవచ్చునన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా... అది వాస్తవం అని తేలింది. పాకిస్థాన్‌కు చెందిన నావెద్ బి(23) ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే సుమారు ఏడాది క్రితమే నావెద్ బెర్లిన్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలో ఏ మూల ఉగ్రవాద దాడులు జరిగినా, దారుణాలు వెలుగులోకి వచ్చినా, మారణకాండలు సృష్టించిబడినా అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాక్ హస్తం ఉంటుందని మరోసారి తేటతెల్లమైంది!