Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్. వర్సెస్ బీజేపీ: గ్రేటర్ లో ఫ్లెక్సీ రాజకీయాలు

By:  Tupaki Desk   |   25 Nov 2020 10:30 AM GMT
టీఆర్ఎస్. వర్సెస్ బీజేపీ: గ్రేటర్ లో ఫ్లెక్సీ రాజకీయాలు
X
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో గులాబీ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నలు చేస్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా అన్నింటినీ హైలెట్ చేస్తూ ప్రచారం లో దూసుకుపోతోంది బీజేపీ. బండి సంజయ్ - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ బ్రాండ్ల లాగా వ్యవహరిస్తున్నారు.

ఎప్పుడూ ప్రభుత్వాన్ని వివిధ అంశాల్లో నిలదీసే బండి సంజయ్‌ కు తాజాగా ఎంపీ అర్వింద్‌ కూడా తోడయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వీరిద్దరి విమర్శలు కొన్ని చోట్ల వివాదాస్పదం కూడా అవుతున్నాయి.

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పై టీఆర్ఎస్ లీగల్ సెల్.. డీజీపీకి ఫిర్యాదు చేసింది. టీఆర్ ఎస్‌ కు సంబం ధించిన బ్యానర్లను పెట్టుకోవడానికి లీగల్‌ గా అన్ని పర్మిషన్లు ఉన్న వాటిని చింపడంపై ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీలను తన అనుచరులతో కలిసి ఎంపీ అర్వింద్ చించారు. ఒక ఎంపీ అయి ఇలాంటి చిల్లర రాజకీ యాలు చేస్తున్నారని గులాబీ పార్టీ మండిపడింది.

వెంటనే ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోరారు. కేసు నమోదు అయినట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎంపీ అరవింద్ కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కేసీఆర్ ఫ్లెక్సీలను ఎంపీ అరవింద్ అతని అనుచరులతో కలిసి తొలగించారు.

ఈ సందర్భంగా అరవింద్ కేటీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మంత్రి.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారన్నారు. పిల్లర్లు, పబ్లిక్ టాయిలెట్స్, బస్టాండ్‌లపై మీ బొమ్మలు అంటిస్తున్నారన్నారు. ఇది ఏం మీ అయ్య సొత్తు కాదన్నారు.

మరోవైపు, బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్స్‌తో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆయన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన ఈ కౌంటర్‌కు ఎంపీ అర్వింద్ ఏకంగా వరుస ట్వీట్లు చేస్తూ మరో స్థాయిలో తిరిగి కౌంటర్ ఇచ్చారు.