Begin typing your search above and press return to search.
దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తప్పు ఎవరిది?
By: Tupaki Desk | 27 Oct 2020 10:15 AM ISTదుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ రాజకీయం నడుస్తోంది. గెలుపే ధ్యేయంగా ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి బలహీనతలపై మరొకరు దాడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్ఎస్ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దుబ్బాక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ఎస్, బీజేపీ తమ బలాలు ప్రయోగిస్తున్నాయి. బీజేపీలోని కేంద్రం అండతో రెచ్చిపోతుంటే.. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికార బలంతో సై అంటోంది.
తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేయడం కలకలం రేపింది. ఇది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారి ఉద్రిక్తతకు దారితీసింది.
రఘునందన్ రావు మామ రాంగోపాల్ రావు, మరో బంధువు అంజన్ రావు ఇళ్లలో అధికారులు సోమవారం సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ సోదాల్లో అంజన్ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67 లక్షలు లభించాయి.
ఈ సమాచారం తెలియగానే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అంజన్ రావు ఇంటికి చేరుకొని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట కూడా జరిగింది.ఈ తోపులాటలో రఘునందన్ రావు సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో కొంత మొత్తాన్ని బీజేపీ శ్రేణులు లాక్కెళ్లాయి.
అంజన్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది.. టీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.పోలీసుల సోదాలు, బీజేపీ కార్యకర్తల హల్ చల్, తోపులాట, డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ తో బీజేపీలోని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా సిద్దిపేటకు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆరాతీశారు.
ఎన్నికల కోడ్ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదా చేసి పట్టుకున్నామని పోలీసులు చెబుతుండగా.. పోలీసులే డబ్బులు తెచ్చి పెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, నినాదాలతో సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికల వేడి మరింత రాజుకుంది.
మా అత్త గారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య, కూతురు అత్తగారి ఇంటికి వచ్చారని చెప్పారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఖర్చు చేసేందుకు నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామని.. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా హాజరయ్యారని..టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తోపాటు రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో కూడా డబ్బులు భారీగా దొరికాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.250మంది బీజేపీ అనుచరులు పోలీసులపై దాడి చేసి 12.80 లక్షలు తీసుకెళ్లారని చెప్పారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక దుబ్బాకలో బీజేపీ గుండాగురి చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అడ్డదారిలో డబ్బులు పంచి గెలిచేందుకు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు.