Begin typing your search above and press return to search.
నాడు అంజయ్య.. నేడు కేసీఆర్.. రగులుతున్న అవమానం?
By: Tupaki Desk | 28 Nov 2020 4:20 PM ISTజీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోడీ పర్యటన చిచ్చు రేపుతోంది. మోడీ హైదరాబాద్ వచ్చేవేళనే ఇటు కేసీఆర్ బహిరంగ సభను పెట్టుకోవడంతో హిట్ పెరిగింది. అదే సమయంలో ప్రధాని అధికారిక పర్యటనకు సీఎంను దూరం పెట్టడం వివాదాస్పదమవుతోంది. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం ప్రత్యేక సమాచారం ఇవ్వడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, గవర్నర్ వెళ్లి స్వాగతించడం సహజంగా జరిగేదే. గత సంప్రదాయాలకు, ప్రొటోకాల్ కు తిలోదకాలిచ్చేలా ప్రధాని వ్యవహరించిన తీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాష్ట్ర ప్రభుత్వం, ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు వస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగనున్నారు. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారట. అంతే కాకుండా ప్రధాన మంత్రికి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది.
హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్ లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. కేసీఆర్ సైతం దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీన్ని ఎలుగెత్తి చాటుతున్నారు.
ప్రధాని అధికారిక పర్యటనకు రాష్ట్ర సీఎంను రావొద్దని చెప్పడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టిన ఢిల్లీ పెద్దలకు తగిన బుద్ది చెబుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. ఆనాడు సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించినట్లు ఈనాడు కేసీఆర్‌ను మోదీ అవమానిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని అందిపుచ్చుకోవడంతో రాజకీయంగా ఇదిప్పుడు దుమారం రేపుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పెద్ద ఫైట్ నడుస్తున్న వేళ ఈ దుమారంపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.