Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ప్లీన‌రీ గాలి తీసేసిన రేవంత్‌!!

By:  Tupaki Desk   |   27 April 2022 5:00 PM IST
టీఆర్ ఎస్ ప్లీన‌రీ గాలి తీసేసిన రేవంత్‌!!
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌..21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా.. ఆ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణ ఏర్పాటుతో నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఆకాశాన్నంటుతున్నాయ‌ని కానీ, ఇదంతా ప్ర‌జ‌ల నుంచి దోచుకున్న సొమ్మేన‌ని వ్యాఖ్యానించారు.

రేవంత్‌ రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. టీఆర్ ఎస్‌ అధినేత కేసీఆర్ నిజాం ప్ర‌భువును నుంచి పోయార‌ని ఘాటైన విమర్శలు చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని రేవంత్ వ్యాఖ్యానించారు.

నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మే 6న హనుమకొండలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ సందర్భంగా.. జిల్లాల్లో సన్నాహక సమావేశాలపై చర్చ సాగుతోంది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్‌తో రేవంత్ భేటీ అయ్యారు.