Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రులు భ‌లే క‌వ‌ర్ చేస్తున్నారుగా...!

By:  Tupaki Desk   |   22 Dec 2019 2:30 PM GMT
తెలంగాణ మంత్రులు భ‌లే క‌వ‌ర్ చేస్తున్నారుగా...!
X
విష‌యం ఏదైనా రాజ‌కీయాల్లో ఉన్న వారు పీక‌ల‌ దాకా తెచ్చుకునేందుకు ఇష్ట ప‌డ‌రు. ఆదిలోనే వాటిని ప‌రి ష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందున్నారు. ఆయ‌న ఏ విష‌యాన్న‌యినా.. అప్ప‌టిక‌ప్పుడే ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలోనూ ప్ర‌భుత్వం ఇలాంటి ప‌రిస్తితినే ఎదుర్కొంటోంది. రెండో సారి ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌ కు ప‌ట్టం క‌ట్టారు. రెండో ద‌ఫా కేసీఆర్ స‌ర్కారు ఏర్ప‌డి దాదాపు ఏడాది గ‌డిచిపోయింది. మ‌రి ఈ ఏడాదిలో చేసిన ప‌నులు ఏమైనా ఉన్నాయా? అంటే.. లేవ‌నే చెప్పాలి. గ‌తంలో అయితే, కాళేశ్వ‌రం ప్రాజెక్టు - యాదాద్రి డెవ‌ల‌ప్‌ మెంట్ వంటివి ఉన్నాయి.

కానీ, ఇప్పుడు చెప్పుకొనేందుకు ఏమీలేదు. పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచేశార‌నే అప‌వాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచే కాకుండా ప్ర‌తిప‌క్షాల నుంచి కూడా కేసీఆర్‌ కు ప్ర‌శ్న‌లు ఎదురు కానున్నాయి. ఈ ఏడాది కాలంలో ఏం చేశార‌ని నిల‌దీసే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు రానున్నాయి. ఈ వ్య‌తిరేకతో ఓట్లు రాల‌క‌పోతే ఇబ్బందే. దీంతో దీనిని త‌ప్పించుకోవ‌డం ఎలా?; అనే ది ఇప్పుడు కేసీఆర్ ముందున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మంత్రుల‌ను పుర‌మాయించారు. క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లి.. స‌ర్కారీ ద‌వాఖానాలు - కార్యాల‌యాలు - పోలీస్ స్టేష‌న్ల‌ను ప‌రిశీలించాల‌ని ఆయ‌న ఆదేశించారు.

ఫ‌లితంగా మీడియా క‌వ‌రేజ్ వ‌చ్చి.. ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది.. అనే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌నేది కేసీఆర్ వ్యూహం. ఇక‌, అధినేత ఆదేశ‌మే త‌రువాయి.. అన్న‌ట్టుగా మంత్రులు విజృంభించారు. మెద‌క్ జిల్లాలో మంత్రి హ‌రీష్‌ రావు ప‌ర్య‌టించారు. తూఫ్రాన్ మండలంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. మంత్రి ఈటెల రాజేంద‌ర్ హైద‌రాబాద్ నేచ‌ర్ క్యూర్ ఆసుప‌త్రిలో ప‌ర్య‌టించారు. ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ ఏకంగా ఖ‌మ్మం నుంచి కొత్త‌గూడెం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ముగింపు స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు క‌దా…

మంత్రులూ ఎమ్మెల్యేలూ నెల‌కి ఒక‌సారైనా ఆర్టీసీలో ప్ర‌యాణించాల‌ని. దాన్ని తు.చ‌. తప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. ఆర్టీసీలో స‌రుకుల ర‌వాణా త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు… ఖ‌మ్మం - మెహ‌బుబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. మెహ‌బుబాబాద్ జిల్లా ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి - సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో మంత్రి స‌బితారెడ్డి - మంత్రి మ‌ల్లారెడ్డి ప‌ర్య‌టించి మ‌రికొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇలా మొత్తానికి తెలంగాణ మంత్రి వ‌ర్గం.. గ‌త ఏడాది కాలంలో ప్ర‌జ‌లకు చేరువ కాక‌పోయినా.. ఇప్పుడు మాత్రం ఇయ‌ర్ ఎండింగ్‌ లో ప్ర‌జ‌ల‌కు చేరువై.. క‌వ‌ర్ చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.