Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్‌ కు భారీ ప‌రాభ‌వం

By:  Tupaki Desk   |   14 July 2017 10:49 AM IST
ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్‌ కు భారీ ప‌రాభ‌వం
X
తెలంగాణ‌లో అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. నల్గొండ నియోజకవర్గంలో అధికార టీఆర్ ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతికీ జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ ఓటమి పాలయింది. ఇదే గ్రామ పంచాయతీకీ జరిగిన సాధారణ ఎన్నికలలో 1000ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ ఎస్ తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఒడిపోయింది. త‌ద్వారా నల్గొండ నియోజకవర్గంలో గట్టి పట్ట ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి రాజుపేట ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినీ గెలిపించి తన పట్టు కాపాడుకున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో సర్పంచ్ గా గెలిచిన టీఆర్ ఎస్ అభ్యర్థిని ఆకస్మికంగా మరణించడంతో ఉపఎన్నికలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీతో టీఆర్ ఎస్ అంత‌ర్గ‌తంగా అవ‌గాహ‌న కుదుర్చుకుంది. అయినప్ప‌టికీ టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఓట‌మి పాల‌య్యారు. త‌మ‌ అభ్యర్థి గెలుపుతో కాంగ్రెస్ సీనియ‌ర్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవలనే నల్గొండ నియోజకవర్గం పరిధిలోని కనగల్ మండల పరిధిలోని రెండు ఎంపీటీసీలకు జరిగిన ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.