Begin typing your search above and press return to search.
తెలంగాణలో 'ఈడీ' ఆట మొదలైందా? మొదటి వికెట్ నామా నాగేశ్వరరావు
By: Tupaki Desk | 3 July 2022 8:33 AM ISTఇప్పటివరకు మాటలతో సాగుతున్న యుద్ధం.. చేతల్లోకి వెళ్లిపోయిందా? దేశంలోని మరే ప్రాంతీయ పార్టీ సైతం ఇవ్వనన్ని ధమ్కీలు టీఆర్ఎస్ నుంచి ఎదురైనా.. తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ.. వేచి చూసే ధోరణిని వెనక్కి తీసుకుందా? వ్యూహరచనలో దేశంలోనే అత్యంత క్లిష్టమైన రాజకీయ అధినేతగా పేరున్న కేసీఆర్ విషయంలో ఆచితూచి అన్నట్లు చూసిన మోడీ పరివారం.. ఇప్పుడు డైరెక్టు అటాక్ అన్న విషయాన్ని స్పష్టం చేసేలా తన శక్తిని ప్రదర్శించారా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వచ్చే పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ అన్ని హద్దుల్ని దాటేసిందని.. మర్యాద గీతల్ని చెరిపేసినట్లుగా భావిస్తున్న కమలనాథులు.. అందుకు తగ్గట్లు బదులివ్వాలన్న దానికి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
తాము ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు మొదలుకొని.. ప్రచారానికి అవసరమైన అన్ని దారుల్ని మూసేసిన తీరుపై బీజేపీ అధినాయకత్వం తీవ్రమైన గుస్సాతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ కు వస్తున్న రోజే.. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు రప్పించటం.. ఆయనకు స్వాగతం చెప్పేందుకు సీఎం కేసీఆర్ ప్రదర్శించిన తీరు.. ఆ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీపై కమలనాథులు కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. యశ్వంత్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత.. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన ఘాటు విమర్శలకు తొలి ఫలితం తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన వైనం చూసినప్పుడు.. అసలు సిసలు ఆట షురూ అయినట్లేనన్న మాట వినిపిస్తోంది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్ వెంట.. అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించారు నామా నాగేశ్వరరావు. సాయంత్రం అయ్యేసరికి ఆయనకు చెందిన రూ.90 కోట్లకు పైనే ఆస్తుల్ని అటాచ్ చేయటం ద్వారా భారీ షాకిచ్చారని చెప్పాలి. ఇక.. నామా ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయటంపై వివరణ ఇస్తున్నారు.
రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో నామాకు చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తుల్ని జప్తు చేసినట్లుగా ఈడీ వెల్లడించింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే నామా నాగేశ్వరరావు మధుకాన్ ప్రాజెక్ట్స్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ పలు రంగాలకు విస్తరించిన నేపథ్యంలో మధుకాన్ గ్రూప్ గా తన పేరును మార్చుకుంది.
నిర్మాణ రంగంలోనూ ఉన్న ఈ సంస్థ.. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవేను నిర్మించారు. ఈ ప్రాజెక్టు పేరుతో వివిధ బ్యాంకుల నుంచి మధుకాన్ గ్రూపు సంస్థలు రూ.10.3 కోట్ల రుణాల్ని పొంది.. దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసు 2002లో ఈడీ నమోదు చేసింది. అంతేకాదు.. ఆరు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగినట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆరు డొల్ల కంపెనీలు నామా నాగేశ్వరరావు.. నామా సీతయ్య ఆధీనంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం కేసు నమోదు చేసిన ఈడీ.. తాజాగా మాత్రం ఆయనకు చెందిన రూ.96 కోట్ల విలువైన ఆస్తుల్ని జఫ్తు చేసినట్లు ప్రకటించారు. ఇందులో హైదరాబాద్.. బెంగాల్.. విశాఖ.. ప్రకాశం.. క్రిష్ణా జిల్లాల్లోని రూ.88.85 కోట్ల విలువైన భూములు.. మధుకాన్ షేర్లతో పాటు రూ.7.36 కోట్ల చరాస్తుల్ని సైతం అటాచ్ చేసినట్లుగా చెబుతున్నారు. జలవిహార్ లో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తూ సభను నిర్వహించిన కేసీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారుపై ఘాటు విమర్శలు చేసిన వేళ.. గులాబీ బాస్ పక్కనే నామా ఉన్నారు. ఆ టైంలోనే నామాకు చెందిన ఆస్తుల్ని ఈడీ జఫ్తు చేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ఇప్పటివరకు తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య సాగిన వార్ కు భిన్నమైన యుద్ధం ఇక మొదలైనట్లేనన్న మాట వినిపిస్తోంది.