Begin typing your search above and press return to search.

బీజేపీ - టీఆర్ ఎస్ పొత్తుపై క‌విత క్లారిటీ ఇది

By:  Tupaki Desk   |   29 July 2017 1:53 PM GMT
బీజేపీ - టీఆర్ ఎస్ పొత్తుపై క‌విత క్లారిటీ ఇది
X
తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న డ్ర‌గ్స్ అంశంపై స్పందించారు. పేకాట - గుడుంబా లాంటి రుగ్మతలను నిరోదించినట్లు డ్రగ్స్ పై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని క‌విత తెలిపారు. డ్రగ్స్ అంశాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వివ‌రించారు. డ్ర‌గ్స్ విష‌యంలో తమ ప్ర‌భుత్వాని ప్ర‌త్యేక‌మైన వ్య‌తిరేక‌త కానీ ఆపేక్ష కానీ లేనేలేద‌ని స్ప‌ష్టం చేశారు. సినిమా పరిశ్రమను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని ఎంపీ క‌విత వివ‌రించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజయ్ సింగ్ డ్ర‌గ్స్ మాఫియాలో టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఉన్నాయ‌ని చేసిన ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని ఎంపీ క‌విత క్లారిటీ ఇచ్చారు. దిగ్విజ‌య్ సింగ్‌ చేసే ఆరోపణలకు అధారాలు ఉండవని ఎద్దేవా చేశారు. గ‌తంలో పోలీసుల‌పై సైతం ఇదే రీతిలో కామెంట్లు చేశార‌ని గుర్తు చేశారు. దిగ్విజ‌య్‌ సింగ్‌ ను పట్టించుకోవద్దని ఎప్పుడో నిర్ణయించుకున్నామ‌ని క‌విత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన మ‌రో కేంద్ర మాజీ జైరాం రమేష్ తన మేధోసంపత్తి అంతా ఉపయోగించి ఆరోపణలు చేశారు కానీ అవన్ని తప్పులని తేలిపోయాయని గుర్తుచేశారు.

రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు లేకపోవడం వల్ల త‌మకేం నష్టం లేదని ఎంపీ క‌విత క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌లి కాలంలో బీజేపీ-టీడీపీ స‌ఖ్య‌త బ‌ల‌ప‌డటం గురించి క‌విత క్లారిటీ ఇచ్చారు. బీజేపీ-తెరాస కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాయనేది ఇప్పటికైతే ఊహాగానాలు మాత్రమేన‌ని ఆమె తేల్చిచెప్పారు. గ‌త కొద్దికాలంగా త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జ‌గిత్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డి నుంచి పోటీ చేయ‌డం గురించి సైతం క‌విత స్ప‌ష్ట‌త ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీచేస్తాననే అంశం త‌న‌ చేతిలో లేదని ఎంపీ క‌విత క్లారిటీ ఇచ్చారు. త‌మ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలపై ఆధారపడి ఉంటుంద‌ని వివ‌రించారు.