Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏ అనవసరంగా కెలుక్కుంటున్నారా ?

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:27 AM GMT
ఎంఎల్ఏ అనవసరంగా కెలుక్కుంటున్నారా ?
X
చరిత్రను అందులోను పీడకల్లాంటి చరిత్రను ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు కెలుక్కుంటున్నారు. మీడియాతో వనమా మాట్లాడుతు తనకొడుకు వనమా రాఘవేంద్రపై ప్రత్యర్ధులు కుట్రలుచేసి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారంటు మండిపడ్డారు. వనమా రాఘవ అంటేనే ఒకపుడు తెలుగురాష్ట్రాలు మారుమోగిపోయింది. ఒక ఆస్తితగాదాలో తల్లి, కూతురు, కొడుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. తల్లీ, కూతుర్లు ఒకవైపు కొడుకు మరోవైపు గొడవలు పడ్డారు.

తన తల్లి, చెల్లిని పిలిచి బుద్ధిచెప్పమని కొడుకు వనమా రాఘవను కోరారు. వీళ్ళ గొడవలు తెలిసి సదరు వ్యక్తి తనదగ్గరకు వచ్చేట్లుగా రాఘవే చెశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోనీ వచ్చిన తర్వాత పెద్దమనిషిగా అందరినీ కూర్చోబెట్టి పంచాయితీ చేశారా అంటేలేదు. పంచాయితి భర్తవైకు అనుకూలంగా చెప్పాలంటే ఆయన భార్యను తన దగ్గరకు పంపాలంటు బాగా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆస్తి పంచాయితి స్ధానంలో రాఘవనుండి తనభార్యను ఎలా కాపాడుకోవాలో సదరు భర్తకు అర్ధంకాలేదు.

దాంతో రాఘవ బాధపడలేక కుటుంబంలోని భార్యభర్తలు+ఇద్దరు పిల్లలు పెట్రోలు పోసుకుని నిప్పంటిచుకుని చనిపోయారు. దాంతో రెండురాష్ట్రాల్లో ఆ ఘటన సంచలనమైపోయింది. ఆ ఘటన తర్వాత రాఘవ బాధితులు చాలామంది ఆడవాళ్ళు పోలీసుల దగ్గరకు క్యూకట్టారు. వాస్తవం ఇలాగుంటే ఇపుడు వెంకటేశ్వరరావు మాత్రం తన కొడుకు అమాయకుడని సర్టిఫికేట్ ఇస్తున్నారు. తాను అనారోగ్యంతో రెండునెలలు హైదరాబాద్ లో చికిత్స తీసుకున్న సమయంలో కొడుకుపై కుట్రలు చేసి ఇరికించారని ఎంఎల్ఏ చాలా అమాయకంగా చెబుతున్నారు.

ఇపుడు తాను చెప్పినదాన్ని జనాలు నమ్మాలని ఎంఎల్ఏ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీచేస్తానని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉందికానీ మధ్యలో కొడుకు ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు ? తండ్రిగా తన కొడుక్కు క్లీన్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా ? తన కొడుకు దుర్మార్గుడని చెప్పి ఎంఎల్ఏ రాఘవను పోలీసులకు పట్టిస్తాడని ఎవరు అనుకోవటంలేదు. అయినా అనవసరమైన చెత్తనంతా ఇపుడు ఎందుకు నెత్తినేసుకుంటున్నట్లో ?