Begin typing your search above and press return to search.

సొంత ఎమ్మెల్యేనే కేసీఆర్ కు షాకిచ్చారు

By:  Tupaki Desk   |   5 Oct 2016 5:22 AM GMT
సొంత ఎమ్మెల్యేనే కేసీఆర్ కు షాకిచ్చారు
X
ఎంత ఉదారంగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరికొత్త షాకులు ఇస్తోంది. నిన్నమొన్నటి వరకూ విపక్ష నేతల నుంచి కొత్త జిల్లాలకు సంబంధించిన తలనొప్పులు ఎదురైతే.. ఇప్పుడు ఏకంగా అధికారపక్షం నుంచే రావటం ముఖ్యమంత్రికి ఇబ్బంది కలిగించే అంశమే. పండగ వేళ అందరిని సంతోషంగా ఉంచుతామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కొత్త కొత్త ఆశల్ని తీసుకొచ్చినట్లైంది.

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నిన్న ప్రకటించారు. ఈ విషయం నిన్ననే చర్చించుకున్నాం. అయితే తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు కాకుండా.. స్పీకర్ కు పంపుతూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అన్ని వనరులున్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. ఆందోళనలు భారీగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్న కినుకు ఆయన తీరులో స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే రాజీనామా చేసిన విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో బుధవారం నుంచి 48 గంటల పాటు నారాయణపేట బంద్ కు ఐకాస పిలుపునిచ్చింది. దీంతో.. ఒక్కసారిగా ఉద్రికత్త పెరగటంతోపాటు.. ముఖ్యమంత్రి మీద ఒత్తిడి ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ విపక్ష పార్టీ నేతల నిరసనను తన నిర్ణయంతో తనకు అనుకూలంగా మార్చుకున్న కేసీఆర్.. తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే సంధించిన రాజీనామా అస్త్రానికి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/