Begin typing your search above and press return to search.

బ్రదర్ అనిల్ తో రాజయ్య: అసలు మ్యాటర్ ఇదట.?

By:  Tupaki Desk   |   9 Aug 2021 8:35 AM GMT
బ్రదర్ అనిల్ తో రాజయ్య: అసలు మ్యాటర్ ఇదట.?
X
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం తాజాగా వైరల్ అయ్యింది. ఆయన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో వరుస భేటీలు అయ్యారంటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  తెలంగాణ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య అనంతరం ఆరోపణలతో పదవి కోల్పోయారు. అనంతరం 2018 ముందస్తు ఎన్నికల్లో అసలు రాజయ్యకు టికెట్ దక్కదని అనుకున్నా ‘కడియం శ్రీహరి’ని పక్కనపెట్టి మరీ కేసీఆర్ టికెట్ ఇచ్చాడు. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు. మీడియాలోనూ కనిపించడం లేదు.

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్తతో రాజయ్య భేటి అయినట్టు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఈయన  పార్టీ మారుతాడా? లేక పాత మతపరమైన స్నేహాల అన్న దానిపై బోలెడు చర్చ జరిగింది. అయితే తాజాగా అవి పాత ఫొటోలని.. గతంలో తీసిన ఫొటోలను మరోసారి సోషల్ మీడియాలో తాజావి అని వైరల్ చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే తనపై వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. ‘తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని.. బ్రదర్ అనిల్ ను కలవలేదని’ క్లారిటీ ఇచ్చారు.  పాత ఫొటోలతో పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు.

వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని రాజయ్య హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేసి మనసు గాయపరచవద్దని రాజయ్య విన్నవించారు.

ఈ సందర్భంగా పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చారు. ‘నా జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటాను. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ నాకు భిక్ష పెట్టారు. మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేకపోయారు కాబట్టే కేసీఆర్ దళిత ఎంపవర్ మెంట్ తెచ్చారు’ అని రాజయ్య తెలిపారు.

ఇక రాజయ్య ఫొటోల ప్రచారం వెనుక ఆయన ప్రత్యర్థి. టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఉన్నారన్న ప్రచారంపై కూడా స్పందించారు. ‘కడియం శ్రీహరి, నేను ఒకే జాతి బిడ్డలం.. అందుకే మా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఆయన రెండు సార్లు గెలిస్తే.. నేను నాలుగు సార్లు గెలిచా.. కొన్ని విషయాల్లో నేను కడియం శ్రీహరిని ఆదర్శంగా తీసుకుంటా.. అందుకే నేను గురువును మించిన శిష్యుడనయ్యా’ అంటూ కడియంతో తనకు విభేదాలపై రాజయ్య క్లారిటీ ఇచ్చారు.