Begin typing your search above and press return to search.
కవిత గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల పక్కా ప్లాన్?
By: Tupaki Desk | 1 Oct 2020 11:30 AM ISTనిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన కల్వకుంట్ల కవితను ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె కవిత ఉన్నారు.
ఈ ఎన్నికను పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు మరో 9 రోజుల సమయం ఉండడంతో జోరుగా వలసలు జరుగుతున్నాయి. గత ఎంపీ ఎన్నికల్లో ఫలితం మళ్లీ ఎదురుకాకుండా టీఆర్ఎస్ నేతలు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు.
ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటన్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి చెందిన ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరగా.. మరికొంత మంది ప్రజాప్రతినిధులు క్యూలో ఉన్నారు. కవిత గెలుపు కోసం ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునే పనిలో గులాబీ దండు ఉంది.
ఇప్పటికే నిజామాబాద్ ఎమ్మెల్సీ పరిధిలో 824మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుంటే ఏకంగా 75శాతం మంది టీఆర్ఎస్ కు చెందిన వారే. ఇక బీజేపీ నేతలను లాగేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను కాపాడుకోవడానికి కష్టపడుతున్నాయి.
ప్రస్తుతం చూస్తే అక్టోబర్ 9న జరిగే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానంలో ఉప ఎన్నికలు వచ్చాయి.