Begin typing your search above and press return to search.
దుబ్బాక వేళ బడాయి మాటల్ని కమలానాథులు తగ్గించాలట
By: Tupaki Desk | 11 Nov 2020 11:15 AM ISTకొన్నిసార్లు అంతే. గింత ఫలితాన్ని చూసి.. గదంతా మనదే అన్నట్లుగా ఫీలయ్యే వారు కనిపిస్తారు. విజయం తెచ్చే ఆనందంతో వాస్తవాల్ని విస్మరిస్తుంటారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని చూసిన కొందరు తమ బలాన్ని మర్చిపోయి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడుఆసక్తికరంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన సంచలన విజయం నేపథ్యంతో తమ తర్వాతి టార్గెట్ గ్రేటర్ ఎన్నికలంటూ చేస్తున్న ప్రకటనల్లో హడావుడే తప్పించి అసలు విషయం తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. దుబ్బాక ఉప ఎన్నిక వేరు. గ్రేటర్ ఉప ఎన్నిక వేరు. కర్ణుడి చావుకు సవాలచ్చ కారణాలు అన్నట్లు.. దుబ్బాకలో బీజేపీ గెలుపుకు కేసీఆర్ స్వయంగా తీసుకున్న నిర్ణయాలతో పాటు.. ప్రతి దశలోనూ పడిన తప్పటడుగులు బీజేపీకి కలిసి వచ్చాయి. దీనికి తోడు.. తమకు ఉన్న అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించటంతో కమలనాథులు సక్సెస్ అయ్యారు. వాస్తవానికిఈ క్రెడిట్ మొత్తం బీజేపీకి కంటే కూడా.. రఘునందనరావుకే ఇవ్వాలి. ఎందుకంటే.. దుబ్బాకలో ఆయన కాక మరెవరు బరిలో ఉన్నా.. ఇలాంటి ఫలితం అసాధ్యం. వరుస ఓటములతో విపరీతమైన సానుభూతి ఉండటం కలిసి వచ్చేలా చేసింది.
ఇలాంటి అంశాల్ని వదిలేసి.. బీజేపీ ఏదో బలపడిపోయిందని.. తిరుగులేని శక్తిగా మారిందని.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తయారైందన్న మాటలు వాస్తవానికి దూరమన్న విషయాన్ని గుర్తించాలి. ఇలాంటి వాదనల మాయలో పడితే మొదటికే మోసం అన్నది మర్చిపోకూడదు. దుబ్బాక తర్వాత గ్రేటర్ తమ తాజా టార్గెట్ గా చెబుతున్నబీజేపీ నేతలు ఒక విషయాన్ని మర్చిపోతుదున్నారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో తమకు సరైన నాయకత్వమే లేదన్నది మర్చిపోకూడదు.
దుబ్బాకలో అభ్యర్థి పార్టీకి ప్లస్ అయ్యారు. అలాంటి ప్లస్ అయ్యే నేతలు గ్రేటర్ లో లేరన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు గ్రేటర్ లో సత్తా చాటతామని చెప్పే మాటలన్ని ఉత్తవే తప్పించి.. విషయం ఉన్నవి కాదన్నది మర్చిపోకూడదు. దుబ్బాక విజయం తెచ్చిన మత్తు నుంచి త్వరగా బయటకు వచ్చేసి.. వాస్తవంలోకి రాకపోతే.. గ్రేటర్ లో సత్తా తర్వాత.. దుబ్బాక విజయానికి సైతం డ్యామేజ్ తగలటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీన్నో హెచ్చరికలా భావించి పని చేస్తేనే అంతో ఇంతో ఫలితం ఉంటుంది.