Begin typing your search above and press return to search.
అమ్మాయిపై గ్యాంగ్ రేప్ కేసులో టీఆర్ఎస్ నేత కుమారుడు అరెస్ట్
By: Tupaki Desk | 20 April 2022 4:48 AM GMTతెలంగాణలో సంచలనం సృష్టించిన సూర్యాపేట గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాన్ని పోలీసులు వెలికి తీశారు. ఈ రేప్ కేసు ఘటనలో టీఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్ మహ్మద్ ఖాజా కొడుకు షేక్ గౌస్, అతడి ఫ్రెండ్ ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి 20 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి కోదాడకు తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి దారుణంగా కొట్టారు. దీంతో అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఇద్దరూ కలిసి మూడు రోజులు రేప్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు ఉన్నట్టు సమాచారం. కాగా ఈ ఘటన సంచలనమైంది.
తాను ఆటోలో వెళుతుంటే నిందితులు తనను లాక్కెళ్లారని బాధితురాలు చెబుతోంది. రాత్రిపూట ఇంటికి వెళుతున్న సమయంలో తనను కిడ్నాప్ చేశారని.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తాగించడంతో తాను సృహ కోల్పోయానని.. పక్కింటి వాళ్లు చూసి తనను కాపాడారని ఆమె చెప్పింది.
శనివారం ఉదయం నిద్రలేచినప్పుడు నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు గ్రహించింది. ఆమె నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. నిందితులు ఆమెపై శారీరకంగా దాడి చేసి బాధితురాలికి మద్యం తాగించారు. ఆ తర్వాత రేప్ చేసి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టారు.
బాధితురాలిని గమనించిన స్తానికులు ఆమెను కోదాడ పట్టణవాసిగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని రక్షించారు. ఘటనలో బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నేరం అంగీకరించినట్టు సమాచారం.
ఇద్దరు నిందితుల్లో సాయికిరణ్ రెడ్డి, షేక్ గౌస్ పాషా స్నేహితులు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కుమారుడు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తేల్చారు.