Begin typing your search above and press return to search.
తేనెటీగల దాడిలో టీఆర్ఎస్ నేత మృతి
By: Tupaki Desk | 14 Nov 2020 11:03 AM ISTకొన్ని చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ.. అనుభవంలోకి వచ్చినప్పుడు అవెంత సీరియస్ విషయాలన్నది అర్థం కాదు. తాజాగా అలాంటి ఉదంతమే నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఊహించని రీతిలో తేనెటీగల దాడిలో తెలంగాణ అధికారపార్టీకి చెందిన నేత ఒకరు మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పెద్ద జంట్రంకు చెందిన 62 ఏళ్ల నాయిని జయసింహారెడ్డి టీఆర్ఎస్ నేతగా సుపరిచితులు. ప్రస్తుతం రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తమ పొలంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు.
అయితే.. గుడి ఆవరణలో నైవేధ్యం చేసేందుకు పొయ్యి పెట్టారు. అయితే.. వారు పొయ్యి పెట్టిన పక్కనే ఉన్నచెట్టుకు పెద్ద తేనెతుట్ట ఉంది. దాన్ని పెద్దగా పట్టించుకోని వారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పొయ్యి వెలిగించేశారు. ఈ వేడికి ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో.. అక్కడ చేరుకున్న వారంతా వాటి బారినపడకుండా ఉండేందుకు పరుగులు తీశారు.
అయితే.. జయసింహారెడ్డి.. ఆయన సోదరుడు రాఘవరెడ్డి.. పూజారి శేఖర్ తదితరలు తీవ్రంగా గాయపడ్డారు.దీంతో.. వారిని నారాయణపేట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దారిలోనే జయసింహారెడ్డి మరణించారు. తేనెటీగల దాడికి ప్రాణం పోయిన ఈ పరిణామంతో స్థానికులు షాక్ తిన్నారు.