Begin typing your search above and press return to search.

లోకేశ్ ఎవరికి పుట్టిన బిడ్డ? :దేవీ ప్ర‌సాద్

By:  Tupaki Desk   |   8 Sep 2018 1:05 PM GMT
లోకేశ్ ఎవరికి పుట్టిన బిడ్డ? :దేవీ ప్ర‌సాద్
X
తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధినేత పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని - టీఆర్ ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల‌ను ఆపద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆక‌ర్షించార‌ని ఏపీ మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రోళ్ల ఓట్ల‌తో గెలిచిన త‌మ ఎమ్మెల్యేలు ..టీఆర్ ఎస్ లో చేరేలా కేసీఆర్ ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు. అంతేకాకుండా, కేసీఆర్ ముందస్తు ప‌థ‌కం వెన‌కు కథ నడిపించింది మోదీ అని - వారిద్ద‌రికీ అక్ర‌మ సంబంధం ఉందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో లోకేష్ పై టీఆర్ ఎస్ నేత‌లు ఎదురుదాడి ప్రారంభించారు. లోకేష్ పై ఉద్యోగుల సంఘం నేత - టీఆర్ ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.‘లోకేశ్ ఎవరికి పుట్టిన బిడ్డ?’ అంటూ దేవీ ప్ర‌సాద్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆ కామెంట్ చేసిన వెంట‌నే....లోకేష్ కాంగ్రెస్‌ కు పుట్టిన బిడ్డే కదా అంటూ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి.

టీడీపీలో ఉండడం ఇష్టం లేక కొంద‌రు టీఆర్ ఎస్ లో చేరార‌ని దేవీ ప్ర‌సాద్ అంగీక‌రించారు. అయితే, "అసలు ఎవరికి పుట్టిన బిడ్డ లోకేష్ ?… కాంగ్రెస్‌కు పుట్టిన బిడ్డ కాదా?" అని షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఆర్ ఎస్ లో చేరిన‌ టీడీపీ ఎమ్మెల్యేల‌పై అభ్యంతరం వ్య‌క్తం చేస్తోన్న లోకేష్....ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను త‌మ పార్టీలో ఎలా చేర్చుకున్నార‌ని ప్ర‌శ్నించారు. దాదాపుగా ప్ర‌తి పార్టీతోనూ పొత్తు పెట్టుకున్న చ‌రిత్ర టీడీపీద‌ని, ఆఖ‌రికి కాంగ్రెస్ తో కూడా పొత్తుకు సిద్ధంగా ఉంద‌ని విమర్శించారు. అక్రమ సంబంధానికి ఇంతకంటే డిక్షనరీలో అర్థం ఉంటుందా అని దేవిప్రసాద్ ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ కోమాలో ఉంద‌ని - అందుకే కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా చంద్ర‌బాబు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలంగా ఉంద‌ని రఘువీరారెడ్డి కూడా చెప్పలేకపోతున్నారని, కానీ బాబు చెప్ప‌డం విశేష‌మ‌ని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు ఒకటి రెండు సీట్లు కూడా రావ‌న్నారు. మోదీ, కేసీఆర్ మధ్య అక్రమసంబంధాన్ని నాలుగేళ్లుగా చంద్రబాబు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు.