Begin typing your search above and press return to search.

మునుగోడు బైపోల్: 8 రౌండ్లు పూర్తి.. 3వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం.. ఎవరికెన్ని ఓట్లంటే?

By:  Tupaki Desk   |   6 Nov 2022 8:45 AM GMT
మునుగోడు బైపోల్: 8 రౌండ్లు పూర్తి.. 3వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం.. ఎవరికెన్ని ఓట్లంటే?
X
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ నెమ్మదిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ ఫలితాలు వెలువడుతాయని అనుకున్నా ఆలస్యం అవుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మెజార్టీ చేతులు మారుతూ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నానికి తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలోకి దిగారు.

ఇక తొలి రౌండ్ గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. స్టల్ బ్యాలెట్ లో టీఆరెఎస్ ముందంజ వేసింది. 686 పోస్టల్ బ్యాలెట్.. 6సర్వీసు ఓటర్లు.. మొత్తం 692 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 4 ఓట్ల ఆధిక్యం లభించింది. వీటితో టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా.. బీజేపీకి 224, బీఎస్పీ అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయి.

ఇక తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 2వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించిడం విశేషం. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6069 ఓట్లు రాగా.. బీజేపీకి 4904 ఓట్లు, కాంగ్రెస్ కు 1887 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ లోనే టీఆర్ఎస్ ఏకంగా 1192 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా గులాబీ దండు మునుగోడులో పోటీనిస్తోంది. అయితే బీజేపీ కూడా బాగానే ఫైట్ ఇస్తోంది.

రెండో రౌండ్ లో రాజగోపాల్ రెడ్డి ఏకంగా 789 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. రెండో స్థానంలో టీఆర్ఎస్ ప్రభాకర్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ స్రవంతి ఉన్నారు.

ఇక మూడో రౌండర్ లో టీఆర్ఎస్ కు 7010 ఓట్లు రాగా.. బీజేపీకి 7426 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ పై 416 పరుగుల ఆధిక్యాన్ని బీజేపీ సాధించడం విశేషం.

ఇక నాలుగో రౌండ్ లో బీజేపీపై 299 ఓట్ల ఆధిక్యంలోకి టీఆర్ఎస్ వచ్చింది. 5వ రౌండ్ కు వచ్చేసికి ఇది 917, 6వ రౌండ్ కు 638 ఆధిక్యం లభించింది. 7వ రౌండ్ కు వచ్చేసరికి 2555కు చేరింది.

ప్రస్తుతం 8వ రౌండ్ పూర్తయ్యింది. టీఆర్ఎస్ కు ఇందులో 6624 ఓట్లు, బీజేపీకి 6088 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇప్పటివరకూ అన్ని రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ కు 3091 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

ఓవరాల్ గా టీఆర్ఎస్ కు 52334 ఓట్లు రాగా.. బీజేపీకి 49243 ఓట్లు, కాంగ్రెస్ కు 13689 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ ఆధిక్యం 3వేలు దాటడం విశేషం.