Begin typing your search above and press return to search.
సారు రతనాల సీమ చేస్తానంటే.. ఈ కంప్లైంట్స్ ఏమిటి బాసూ?
By: Tupaki Desk | 17 Aug 2019 12:48 PM ISTధోరణితో వ్యవహరించాలని.. దగ్గర దగ్గర లక్ష కోట్లకు కాస్త అటుఇటుగా ఖర్చు అయ్యే ఒక భారీ ప్రాజెక్టును కలిసి నిర్మించాలని రెండురాష్ట్రాలు అనుకుంటే.. వాటి మధ్య అనుబంధం ఎంతలా ఉండాలి? చిన్న చిన్న విషయాల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు ఉండకూడదు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది తెలంగాణ.
ఏపీఐఐసీ ఛైర్మన్ కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసానికి భోజనానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అనంతరం చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోకూడదు. జగన్ కు అన్నగా.. కరవుతో అల్లాడే రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని వ్యాఖ్యానించి.. అందరిని అవాక్కు అయ్యేలా చేశారు. ఏపీ మీద తరచూ విరుచుకుపడటమే కాదు.. తన ప్రేమను ప్రదర్శించటం కేసీఆర్ ఇదే తొలిసారి. మరి.. ఏపీలోని సీమ సీన్ ను మారుస్తానని చెబుతున్న కేసీఆర్ మాట తర్వాత అయినా తెలంగాణ ప్రభుత్వ అధికారుల తీరు మారాలి కదా?
ఓపక్క సీమను బాగు చేస్తానంటూ సీఎమ్మే స్వయంగా చెప్పేసిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం ఏదో తప్పులు చేసేస్తుందంటూ చేస్తున్న ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఎక్కువ నీటిని తరలిస్తున్నారని.. గణాంకాల్లో మాత్రం ఏపీ అధికారులు తక్కువగా చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు.
ఈ నెల 10 నుంచి 12 తేదీల మద్య 7 పాయింట్ 28 టీఎంసీల నీటిని తరలించినట్లుగా ఏపీ ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు టెలిమెట్రీ యంత్రాల రికార్డుల ప్రకారం 9 పాయింట్ 24 టీఎంసీలు నమోదైనట్లుగా తెలంగాణ అధికారులు చెబుతున్నారు. నీటిని తరలిస్తున్న వైనంపైనా.. లెక్కలు చూసేందుకు తమకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరే.. ఓపక్క స్వయంగా తెలంగాణ సీఎమ్మే సీమను రతనాల సీమను చేస్తామని చెప్పిన తర్వాత కూడా.. ఒకట్రెండు టీఎంసీల మీద ఈ పంచాయితీ అవసరమంటారా?