Begin typing your search above and press return to search.
150 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్
By: Tupaki Desk | 17 Nov 2020 11:34 PM ISTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక..ప్రచారానికి సన్నాహాలు వంటి కార్యక్రమాలు మొదలెట్టేశాయి. ఎన్నికలకు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రచిస్తున్నాయి.
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఒకేసారి 150 వార్డులకు అభ్యర్థుల జాబితాను ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో, తమకు సీటు దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారు. మెజారిటీ టికెట్లు సిట్టింగ్‌లకు కేటాయించి అసమ్మతుల బెడద లేకుండా చూడాలని టీఆరఎస్ భావిస్తోంది. ఇక, గులాబీ దళం మిత్రపక్షం ఎంఐఎం పాతబస్తీలో తన పట్టు కోల్పోకుండా అన్ని స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది. దుబ్బాక గెలుపు ఇచ్చిన ఊపుతో బీజేపీ కూడా బల్దియా బరిలో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.
గత ఎన్నికల్లో 150 స్థానాలకు గాను టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరో 3 కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సారి సోలోగానే సెంచరీ కొట్టాలన్న యోచనలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారట. ఇప్పటికే గెలుపు గుర్రాలపై కేటీఆర్ సర్వే చేయించారని తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే, అభియోగాలు ఎదుర్కొంటోన్న సిట్టింగ్ కార్పొరేటర్లు మినహా మిగతా వారికి టికెట్లను టీఆర్ఎస్ కన్ఫమ్ చేసినట్టు తెలుస్తోంది.
సిట్టింగ్ కార్పొరేటర్లలో 20 మందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో వారిని పక్కకుపెట్టి కొత్త వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కూడా యథాతథంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత కార్పొరేటర్లలో చాలామందికి మళ్లీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారట. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక కార్యాచరణ దాదాపుగా ముగిసిందని తెలుస్తోంది. మరోవైపు, టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం గత ఎన్నికల్లో 60 స్థానాలలో పోటీ చేసి 44 దక్కించుకుంది. ఈ సారి ఎలాగైనా 60 స్థానాలు దక్కించుకోవాలని మజ్లిస్ భావిస్తోంది.