Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి వస్తానన్నా.. టీఆర్ ఎస్ వద్దంటోంది..

By:  Tupaki Desk   |   17 March 2019 4:28 PM IST
జగ్గారెడ్డి వస్తానన్నా.. టీఆర్ ఎస్ వద్దంటోంది..
X
ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ ఎస్ ను ఎదుర్కొని గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. కానీ ఈయన గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రవర్తించడంలేదు. కాంగ్రెస్ నాయకులతో కలిసి సాగడం లేదు. తాజాగా హరీష్ రావు అంటే పడని ఈ నేత టీఆర్ ఎస్ లోకి వస్తున్నారని వార్తలొచ్చాయి. కేసీఆర్ ను కూడా ఇక తిట్టనని.. టీఆర్ ఎస్ పాలన బాగుందని చెప్పిన జగ్గారెడ్డి గులాబీ గూటికి చేరడానికి ప్రయత్నాలు అన్నీ చేశారట.. కానీ టీఆర్ ఎస్ మాత్రం జగ్గారెడ్డిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

ఇటీవల జగ్గారెడ్డి కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఆ నేతల ఉదాసీనతను ప్రశ్నించారు. అదేసమయంలో హరీష్ రావును కూడా జిల్లాలో బాగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఇలా టీఆర్ ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ టీఆర్ ఎస్ అధిష్టానం మాత్రం కాంగ్రెస్ హయాంలో టీఆర్ ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టిన జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఒప్పుకోవడం లేదట..అందుకే జగ్గారెడ్డి వస్తానన్నా.. టీఆర్ ఎస్ మాత్రం వద్దంటోంది అన్న టాక్ వినిపిస్తోంది.

టీఆర్ ఎస్ నుంచి దారులు మూసుకుపోయిన నేపథ్యంలో తాజాగా జగ్గారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందట.. కాంగ్రెస్ నేతలకు కూడా అందుబాటులోకి రాలేదట.. బహుషా అయినా టీడీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది.