Begin typing your search above and press return to search.

నా తాయెత్తు ఎమ్మెల్యేను గెలిపించింది..ఇప్పుడు నిన్ను గెలిపిస్తుంది

By:  Tupaki Desk   |   28 Jan 2020 12:57 PM GMT
నా తాయెత్తు ఎమ్మెల్యేను గెలిపించింది..ఇప్పుడు నిన్ను గెలిపిస్తుంది
X
కంప్యూటర్‌ యుగంలో కూడా మూడ నమ్మకాలు ఇంకా ఎంతో మంది నమ్ముతూనే ఉంటారు. ఎంతో మంది మూడ నమ్మకాలతో మెడలో తాయెత్తులు కట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కాని ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు కూడా తాయెత్తులను నమ్మితే పరిస్థితి ఏంటీ చెప్పండి. హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఒక స్వామీజీ ఇచ్చిన తాయెత్తును మెడలో కట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేగా గెలిచాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆ స్వామీజీ చెప్పాడు.

తాయెత్తు వల్ల ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే అనుమానం రావచ్చు. కాని ఒక స్వామీజీ స్వయంగా తన వల్లే సైదిరెడ్డి గెలిచాడు అంటూ చెప్పుకోవడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లి సత్తయ్య తాను ఎన్నికల్లో గెలుపొందాలంటూ ఒక స్వామీజీని ఆశ్రయించడం జరిగింది. ఆ స్వామీజీ ఆయనతో మాట్లాడుతూ నిన్ను నేను గెలిపిస్తాను. హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నేనే గెలిపించాను.

నేను ఇచ్చిన తాయెత్తు వల్లే సైదిరెడ్డి గెలిచాడు. అందుకే ఆయన మెడలో నేను ఇచ్చిన తాయెత్తు ఇంకా ఉంటుందని ఆ స్వామీజీ అన్నాడు. అయితే ఆ మాటలను సత్తయ్య రికార్డు చేయడం జరిగింది. తాను తాయెత్తు ఇవ్వగా గెలవడం తద్యం ఆతర్వాత నేను కోరుకున్నది ఇవ్వాలంటూ బేరం ఆడాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఆడియో టేపుతో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సైదిరెడ్డి మెడలో ఇప్పటికి కూడా తాయెత్తు ఉండటంతో ఆ స్వామీజీ మాటలు నిజమేనేమో అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వివాదంతో సైదిరెడ్డి తన మెడలోని తాయెత్తును తొలగిస్తాడేమో చూడాలి.