Begin typing your search above and press return to search.

మోడీకి 17 ప్రశ్నలతో టీఆర్ఎస్ బ్యానర్లు.. కలకలం

By:  Tupaki Desk   |   26 May 2022 10:30 AM GMT
మోడీకి 17 ప్రశ్నలతో టీఆర్ఎస్ బ్యానర్లు.. కలకలం
X
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:25 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగారు. పాత విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మోదీ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు చేరుకొని అక్కడ ప్రసంగించారు.

ప్రధాని మోదీకి స్వాగతించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ అందుబాటులో లేకుండా పక్క రాష్ట్రం కర్ణాటకకు వెళ్లారు. కేసీఆర్ స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛనాలు పూర్తి చేశారు. అయితే టిఆర్ఎస్ మాత్రం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించుకుంది. 17 జంక్షన్లలో మోడీ హామీలను ప్రశ్నిస్తూ పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేసింది.

టిఆర్‌ఎస్‌కు పీఎం మోడీ మార్గం గురించి అవగాహన ఉంది కాబట్టి ఈ జంక్షన్‌ల వద్ద ఈ పెద్ద బ్యానర్‌లను ఏర్పాటు చేసింది. మోడీ వాటి గుండానే వెళ్లారు. ఢిల్లీలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఈ బ్యానర్‌లపై రాసుకొచ్చారు..

తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలపై కొన్ని బ్యానర్లు ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నాయి. నేటికీ వాటిని నెరవేర్చలేదు. ఇది టిఆర్ఎస్ ద్వారా బాగా ప్లాన్ చేయబడిన వ్యూహంగా కనిపిస్తోంది.

మోడీకి కనీసం ఒక్క బ్యానర్ అయినా చూడాలని వారు ఈ పనిచేసినట్టు తెలుస్తోంది. తద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పట్టు ఉందని నిరూపించాలనుకుంటున్నారు.

అయితే ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఎస్బీ క్యాంపస్ పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. బయటి వ్యక్తిలను అనుమతించడం లేదు. వాస్తవానికి పోలీసులు ఐఎస్బీ విద్యార్థులపై డేగ కన్ను వేశారు. కొంతమంది బీజేపీ వ్యతిరేక విద్యార్థులను కాన్వకేషన్ నుంచి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నట్లు సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ ప్రదర్శించిన ఫ్లెక్సీలతో మోడీ టూర్ లో కొంత ఇబ్బందికర పరిస్థితినే బీజేపీ ఎదుర్కొన్నట్టైంది.

మోడీజీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ.. ఒక్కో బ్యానర్ మీద ఒక్కో ప్రశ్నను సంధిస్తూ ఏర్పాటు చేశారు. మరి.. ఆ 17 ప్రశ్నలు ఏమిటన్నది చూస్తే..

1. మోదీజీ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?
2. తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఎక్కడ ఉంది?
3. తెలంగాణకు డిఫెన్స్‌ కారిడార్‌ ఎందుకు మంజూరు చేయలేదు?
4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?
5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ?
6. కాజీపేట రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏది?
7. గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ను హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు?
9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
10. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఎక్కడ?11. తెలంగాణకు ఐటీఐఆర్‌ ఎక్కడ?
12. తెలంగాణకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ డిజైన్‌ ఏది?
13. నీతి ఆయోగ్‌ చెప్పినప్పటికీ మిషన్‌ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?
14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు?
15. తెలంగాణకు మెగా పవర్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు?
16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?
17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?