Begin typing your search above and press return to search.

దుబ్బాకలో నామినేషన్లు వేసిన సుజాత, రఘునందన్ రావు

By:  Tupaki Desk   |   14 Oct 2020 1:01 PM GMT
దుబ్బాకలో నామినేషన్లు వేసిన సుజాత, రఘునందన్ రావు
X
తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక దుబ్బాక కాక రేపుతోంది. తాజాగా నామినేషన్ల దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు సుజాత, రఘునందన్ రావులు భారీగా కార్యకర్తలు వెంటరాగా నామినేషన్లు దాఖలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి దుబ్బాకలో పోటీచేయిస్తున్నారు. ఈ క్రమంలోనే సోలిపేట సుజాత ఈరోజు ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక మంత్రి హరీష్ రావు ఈ నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు.కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధి నిరోధకులు అని.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హుజూర్ నగర్ ఫలితాలే దుబ్బాకలో రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

కాగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా... 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కించి విజేతను ప్రకటిస్తారు.