Begin typing your search above and press return to search.
ట్రంప్ నోటి దురద.. మరోసారి చిక్కుల్లో ఇరుక్కుని..
By: Tupaki Desk | 18 Sept 2020 5:20 PM ISTఅమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ డోనాల్డ్ ట్రంప్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. అతడి కారణంగా గతంలో లైంగిక వేధింపులకు గురైన వారు వరుసగా బైట కొచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అతడంటే పడని వారు శత విధాలుగా ట్రంప్ ని ఇరుకున పెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ మొదటి నుంచి కరోనా విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. వ్యాధి నిరోధంలో సరైన చర్యలు చేపట్టలేదని.. అసలు అధ్యక్షుడే మాస్కు ధరించడని.. ఇక జనాన్ని మాస్కు పెట్టుకోవాలని ఎలా సూచిస్తాడని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ట్రంపు మాత్రం కరోనా కట్టడి విషయంలో అంత శ్రద్ధ చూపలేదని ఆరోపణలు ఉన్నాయి. కనీసం మాస్కు ధరించేందుకు కూడా ట్రంప్ ఇష్టపడేవాడు కాదు. ప్రస్తుతం కరోనా విషయంలో ట్రంప్ వైఖరిపై సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కు సహాయకురాలిగా ఉన్న ఒలీవియా ట్రాయ్ ట్రంప్ పై విమర్శలు చేశారు. ఈమె వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ నిర్వాహకురాలిగా పని చేశారు. ఈ వీడియోలో ట్రాయ్ మాట్లాడుతూ ' ట్రంప్ తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడని, కరోనా వైరస్ ని ట్రంప్ అసలు సీరియస్ గా తీసుకోలేదని అందువల్లే వ్యాధి తీవ్రతను, మరణాల సంఖ్యను తగ్గించే లేక పోయాడని ఆమె ఆరోపించింది.పైగా కరోనా నాకు ఎంతో మేలు చేసిందని.. అసహ్యమైన వారితో కరచాలనం చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు చెప్పింది.
ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో అదే అసహ్యమైన జనాలతో ట్రంప్ తిరుగుతున్నాడని, ర్యాలీల్లో పాల్గొంటున్నారని .. ఆయనను ఎవరూ నమ్మవద్దన్నారు. అతడి నిజస్వరూపం తెలుసుకొని ఓటు వేయవద్దని జో బైడెన్ ను గెలిపించు కోవాలని' ట్రాయ్ కోరారు. అయితే ట్రాయ్ చేసిన తీవ్ర ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె వైట్ హౌస్ లో పనిచేస్తూ వెళ్లిపోయేటప్పుడు తన పాలనను ఎంతో ప్రశంసించిందని.. కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో పనిచేయడం ఎంతో గౌరవమని తనకి అందజేసిన లేఖలో ట్రాయ్ పేర్కొన్నట్లు ట్రంప్ వివరించారు. కాగా ట్రంప్ ప్రకటించినట్టు ఇందులో ట్రాయ్ ట్రంప్ ని, పెన్స్ ని ప్రశంసించిన ట్లు ఎక్కడా లేదు.