Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌పై ట్రోల్స్‌.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   7 Oct 2022 6:33 AM GMT
ష‌ర్మిల‌పై ట్రోల్స్‌.. రీజ‌న్ ఇదే!
X
ఔను.. ష‌ర్మిల‌పై ట్రోల్స్ మామూలుగా లేవు. ప్ర‌స్తుతం వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలుగా.. ష‌ర్మిల ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. అయితే.. ఆమె ఎందుకు అంత హుటాహుటిన ఢిల్లీకి వెళ్లింద‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు ష‌ర్మిల ఢిల్లీకి వెళ్లింది. సీబీఐకి ఆమె ఫిర్యాదు చేసి.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని రోడ్డుకు లాగాల‌నేది .. ఆమె వ్యూహంగా ఉంది. అయితే.. దీనిపైనే నెటిజ‌న్లు కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.

ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. రాష్ట్రానికి మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించాల‌ని.. అంతేకానీ.. ఒక‌ళ్ల‌పై ఒక‌ళ్లు ఫిర్యా దులు చేసుకుని.. యాగీ చేసుకునేందుకు కాద‌ని.. అంటున్నారు. ఢిల్లీ వెళ్తున్న ష‌ర్మిల‌.. రాష్ట్రానికి ఏదైనా ఉప‌యోగ‌ప‌డేలా.. నిర్ణ‌యాలు తీసుకుంటే బాగుండేద‌ని అంటున్నారు.

విబ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌కు రావాల్సిన సంస్థ‌ల‌పై ఢిల్లీ పెద్ద‌ల‌తో క‌లుస్తాన‌ని.. చెప్పి ఉంటే.. ఆమె గౌర‌వం పెరిగి ఉండేద‌ని.. అదేవి ధంగా రాజ‌కీయంగా కూడా ఆమెకు మైలేజీ వ‌చ్చి ఉండేద‌ని అంటున్నారు.

అంతేకాదు.. ఇప్పుడిప్పుడే ఎద‌గాల‌ని చూస్తున్న ష‌ర్మిల‌.. ముందు.. తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నసు దోచుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని.. అంతే త‌ప్ప‌.. తెలంగాణ నాయ‌కుల‌ను.. తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భు త్వాన్ని రోడ్డున ప‌డేసే ప్ర‌య‌త్నం చేయ‌డం ఏంట‌ని నిప్పులు చెరుగుతున్నారు. చేత‌నైతే.. డిల్లీ వెళ్లిన స‌మయంలో కేంద్రం నుంచి తెలంగాణ‌కు రావాల్సిన నిధుల విష‌యంలో కోట్లాడాల‌ని, జ‌ల వివాదాల‌కు కేంద్ర‌మే బాధ్య‌త వ‌హించేలా ఒప్పించాల‌ని కూడా.. సూచిస్తున్నారు.

ఇవ‌న్నీ వ‌దిలేసి..కేవ‌లం త‌న రాజ‌కీయ ప‌బ్బం కోసం.. వ్య‌వ‌హ‌రించి.. ష‌ర్మిల ఉన్న ఇమేజ్ కూడా పోగొ ట్టుకుంటుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్లింది.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కాద‌ని.. త‌న స్వార్థం కోసం.. రాజ‌కీయంగా తెలంగాణ ప‌రువును తీయ‌డం కోస‌మేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు. మొత్తానికి ష‌ర్మిల‌పై ట్రోల్స్ మామూలుగా లేవుగా అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.