Begin typing your search above and press return to search.
ఆ ఎంపీని మామూలుగా ట్రోల్ చేయడం లేదుగా
By: Tupaki Desk | 5 Jan 2022 6:00 AM ISTవైసీపీ ఎంపీ మార్గాని భరత్.. చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం దుమారం రేపుతు న్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై.. టాలీవుడ్ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి ఆందోళన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.అ యితే.. ఈఅంశంపై తాజాగా మాట్లాడిన రాజమండ్రి యువ ఎంపీ.. మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్ భారీగా పడుతున్నాయి. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదల చేతుల్లోకి డబ్బులు వెళ్తున్నాయని ఎంపీ వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ నిధులు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ సినిమా ఇండస్ట్రీకే చేరుతున్నాయని వ్యాఖ్యానించారు. సినిమా పెద్దలే బాగుప డుతున్నారని.. చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ``హు! బహుశా మోహన్ బాబు కి, ఆయన కుమారులకు వెళుతూ ఉండొచ్చు!! సినిమాల్లో లాగా "అరిస్తే తరుస్తా... తరిస్తే కరుస్తా... కరిస్తే... నిన్ను కూడా పదవిలోంచి దింపుతా" అని ఒక్కసారి జగనన్న వద్దకు వెళ్లి అనరా భక్త వత్సలం నాయుడు! ఏమైతే అదైంది తరువాత చూసుకొందాం!!`` అని అనేయ రాదా! అంటూ.. ఒకనెటిజన్ ఆసక్తిగా స్పందించారు.
మరొకరు.. ``లిక్కర్ షాపుల గురించి కూడా చెబితే బాగుంటుంది కదా.. పక్క రాష్ట్రాలకు ఏమైనా చేరుతున్నాయా`` అని ప్రశ్నించారు. ఇంకొకరు.. ``మీరు అలా అడిగితే ఏం చెబుతారు. కొంత టైం ఇవ్వండి కవర్ చేయడానికి. వాళ్లవి(అధికార పార్టీ) ఆధార రహిత వ్యాఖ్యలు. లేదా తప్పుడు వ్యాఖ్యలు. లేకపోతే.. వ్యక్తిగతంగా ఇతరును దూషిస్తారు!`` అని కామెంట్ చేశారు. ఇలా.. నెటిజన్లు సదరు ఎంపీ కామెంట్లపై ట్రోల్ చేయడం గమనార్హం. గతంలోనూ ఎంపీ మార్గాని లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదని, కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కామెంట్లు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపైనా నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల సొమ్ముతోనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతోందని వ్యాఖ్యానించడం మరింత విడ్డూరంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.