Begin typing your search above and press return to search.

జగన్ నిర్ణయం పై ఎటకారం ఆడేస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:57 AM GMT
జగన్ నిర్ణయం పై ఎటకారం ఆడేస్తున్నారు
X
ఉత్సాహం మంచిదే. కానీ.. అది మోతాదు దాటకూడదు. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తమ నోటి నుంచి వచ్చే మాటల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. విధానపరమైన నిర్ణయాల్ని తీసుకోవాలనుకున్నప్పుడు సంబంధిత అధికారులతో స్పష్టంగా మాట్లాడిన తర్వాతే నిర్ణయాలను వెల్లడించాలి. అంతేకాదు.. రోటీన్ కు బిన్నమైన అంశాల మీద విధాన ప్రకటన చేసేటప్పుడు అందులోని సాదక బాధకాల ప్రస్తావన తప్పనిసరి. అలాంటిదేమీ లేకుండా.. యాక్సిడెంటల్ గా తనకు అనిపించిన అంశాన్ని అప్పటికప్పుడు ప్రకటించటం వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా అన్నమాట బలంగా వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి చేసిన ఒక ప్రకటనపై నెటిజన్లు తీవ్రంగా రియాక్టు అవుతున్నారు. ఫన్నీ ఎమోజీలను సిద్ధం చేయటమే కాదు.. సీఎం నిర్ణయాన్నికామెడీ చేసుకుంటున్నారు. పంచ్ ల మీద పంచ్ లు వేసుకుంటున్నారు. ఇంతకూఅంత హాట్ టాపిక్ గా మారటానికి కారణం.. సీఎం చేసిన ప్రకటనే. ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్ పోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆయన మాట ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలుఉన్నాయి. మరి.. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఏపీలో 13 ఎయిర్ పోర్టుల్ని నిర్మించాల్సి ఉంటుంది. ఇంత భారీగా ఎయిర్ పోర్టుల్ని నిర్మించటం వల్ల ప్రజలకు కలిగే లాభం ఏమిటి? అన్న సూటి ప్రశ్న పలువురి నోటి వెంట వస్తోంది. రాష్ట్ర ప్రజలకు అవసరమై ప్రజారవాణా బలంగా లేదని.. ఇప్పటికే రాష్ట్రంలోని పలు బస్టాండ్లలో సరైన వసతులు లేవని.. ఏపీలో రోడ్లన్నీ గోతులతో నిండాయని.. అవన్నీ సరి చేయకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు నిర్మించటం వల్ల లాభమేంటి? అన్నది ప్రశ్నగా మారింది.

ప్రజలకు అవసరమైన ప్రజా రవాణా మీద ఫోకస్ పెట్టకుండా.. ప్రతి జిల్లాలో ఎయిర్ పోర్టుల్ని ఏర్పాటు చేసి సాధించేదేమిటి? అన్నది ప్రధాన ప్రశ్న. ఇన్ని ఎయిర్ పోర్టులు ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయి? అన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉంటే.. ఏపీలో జిల్లాల సంఖ్యను పెంచాలని.. ప్రతి లోక్ సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా మార్చనున్నారు. ముందుగా అనుకున్న 24 జిల్లాలకు బదులుగా మరో జిల్లాను కలిపి 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మొదట చెప్పినట్లుగా 13 ఎయిర్ పోర్టులతో ఆపుతారా? లేదంటే పాతిక జిల్లాలకు అనుగుణంగా విమానాశ్రయాలను నిర్మిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవైపు రోడ్లు వేయపోవటం.. మరోవైపు ప్రజలకు అత్యంత అవసరమైన వాటిని పట్టించుకోని సీఎం జగన్.. ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసి.. సాధించాలనుకుంటున్నది ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రోడ్లు వేసేందుకు నిధులు లేవని.. ప్రభుత్వ ఉద్యోగులకు.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫించన్లు టైంకు ఇవ్వట్లేదు కానీ.. ఎయిర్ పోర్టులకు నిధులు వెచ్చిస్తారా? అంటూ మండి పడుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.