Begin typing your search above and press return to search.

అరె ఏంట్రా ఇది..రహానే పై ట్రోలింగ్ !

By:  Tupaki Desk   |   6 Sep 2021 6:45 AM GMT
అరె ఏంట్రా ఇది..రహానే పై ట్రోలింగ్ !
X
అజింక్య రహానె .. భారత టెస్టు టీమ్ వైస్ కెప్టెన్. స్టార్ బ్యాట్స్ మెన్. కానీ, ఇంగ్లాండ్ టూర్‌ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. టూర్‌ లో ఇప్పటికే నాలుగో టెస్ట్ ముగింపుకి చేరుకుంది. ఒక్క మ్యాచ్ లో ఓ ఇన్నింగ్స్ లో మినహా రహానె చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. మరీ ముఖ్యంగా.. మిడిలార్డర్‌ లో భాగస్వామ్యాలను నిర్మించడంలో రహానె ఫెయిలవుతున్నాడు. దాంతో . భారత మాజీ క్రికెటర్లు , భారత్ అభిమానులు రహానే పై విమర్శలు గుప్పిస్తూన్నారు.

తాజాగా జరిగిన నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. వోక్స్‌ వేసిన బంతి ఇన్‌స్వింగ్‌ అయి రహానే ప్యాడ్లను తాకడంతో అప్పీల్‌ చేశాడు. అది క్లీన్‌ ఔట్‌ అని తేలడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. అయితే తన ఔట్‌పై సందేహం వచ్చిన రహానే రివ్యూ కోరాడు. అప్పటికి కోహ్లి రివ్యూకు వెళ్లొద్దని రహానేకు చెప్పినా వినిపించుకోలేదు. రివ్యూలోనూ అదే ఫలితం పునరావృతం కావడంతో రహానే నిరాశగా వెనుదిరిగాడు. రహానే డకౌట్‌ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండో టెస్టులో మాత్రమే అర్థసెంచరీ మార్క్‌ అందుకున్న రహానే మిగతా అన్నిసార్లు దారుణంగా విఫలమయ్యాడు.

మూడు టెస్టులు కలిపి రహానే వరుసగా 5,1, 61, 18, 10 పరుగులు చేశాడు. దీంతో అతని ఆటతీరుపై టీమిండియా ప్యాన్స్‌ వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. రహానేకు టైం దగ్గరపడింది.. రహానే స్థానంలో వేరొకరిని తీసుకోండి.. రహానే ఎందుకిలా.. అంటూ కామెంట్లు చేశారు. రహానే ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు సూర్య‌కుమార్ యాద‌వ్, పృథ్వీ షా లాంటి చాలామంది ప్ర‌తిభావంతులు అవ‌కాశం కోసం చూస్తుంటే జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌ గా ఉన్న సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ ఇంత పేల‌వంగా ఆడుతుండ‌టంతో అత‌డిపై వేటు వేయాల‌న్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఇన్నింగ్స్‌ తో ర‌హానె ప‌నైపోయింద‌ని.. భారత జ‌ట్టులో అత‌డి ప్ర‌స్థానం ముగిసిన‌ట్లే అని సూచిస్తూ ఇండియ‌న్ ఫ్యాన్స్ #ThankYouRahane హ్యాష్ ట్యాగ్‌ ను ట్రెండ్ చేస్తున్నారు.