Begin typing your search above and press return to search.
'ఛీ.డీ.పీ'...చంద్రబాబుపై నెటిజన్ల ట్రోలింగ్!
By: Tupaki Desk | 2 Nov 2018 10:00 PM ISTబీజేపీపై పోరాడేందుకు కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ వేదికగా చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నగారు స్థాపించిన టీడీపీని....అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే స్థాయికి తీసుకువెళ్లిన చంద్రబాబుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మ గౌరవ నినాదాన్ని జపించే చంద్రబాబు.... ఇపుడు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మగౌరవాన్ని మంటగలిపిన వైనంపై కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేక విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పూటకో మాట మారుస్తున్న చంద్రబాబు....రేపు టీడీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సెటైరికల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీడీపీ కాస్తా ఛీడీపీ అయిందని...ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. 1983 నుంచి 2018వరకు ఆయా సందర్భాలను బట్టి ఊసరవెల్లిలా చంద్రబాబు మారిన వైనం ఇదంటూ...ఓ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. చంద్రబాబు చెప్పిన ఆ డైలాగులను నెటిజన్లు సెటైర్లుగా పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు కరుడుగట్టిన టీడీపీ అభిమానులు కూడా చంద్రబాబును తూర్పారబడుతున్నారు. రాహుల్ ను - సోనియాను తిట్టిన నోటితోనే.....పొగడడం జీర్ణించుకోలేకపోతున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఏం చేయడానికైనా బాబు సిద్ధమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలు బాబుకు కొత్తేమీ కాదని - ఆ దిగజారుడుతనంలో ఇది ఇంకో లెవల్ అని అనుకుంటున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ లో టీడీపీని విలీనం చేసినా..ఆశ్చర్యపోనవసరం లేదని మండిపడుతున్నారు.
నెటిజన్లు వైరల్ చేస్తోన్న చంద్రబాబు డైలాగులు యథాతధంగా.....
1983 - NTR మీద పోటీ చేస్తా
1985 - NTR దేవుడు
1995 - NTRకి నైతిక విలువలు లేవు
1999 - బిజెపితోనే అభివృద్ధి సాధ్యం
2003 - మోడీ ని జైల్ లో పెట్టాలి
2004 - బిజెపి వల్లే ఓడిపోయాం
2008 - తెలంగాణకు అనుకూలం
2010 - తెలంగాణకు వ్యతిరేకం
2012 - తెలంగాణకు అనుకూలంగా లెటర్
2013 - సోనియా ఇటలీ దెయ్యం..
2014 - మోడీ దేశానికి కావాలి బిజెపికి మా మద్దతు
2018 - మోడీ ఒక దొంగ...సోనియా దేవత