Begin typing your search above and press return to search.

అయ్యో జ‌గ‌న‌న్న ! ట్రోల‌ర్స్ కు పండుగే పండుగ !

By:  Tupaki Desk   |   16 May 2022 11:30 AM GMT
అయ్యో జ‌గ‌న‌న్న ! ట్రోల‌ర్స్ కు పండుగే పండుగ !
X
బ‌హుశా ! జ‌గ‌న‌న్న‌ది ఇంగ్లీషు మీడియం కాన్వెంట్ చ‌దువులు కావొచ్చు. అందుకే తెలుగులో ఆయ‌న ప‌దాల‌ను త‌ప్పుగా ప‌లుకుతూ ఉన్నారు. ఒక్క‌సారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు. అయినా ఆయ‌న ఎన్ని సార్లు త‌ప్పులు ప‌ల‌క‌కుండా ఉండాల‌నుకున్నా కూడా అది జ‌ర‌గ‌ని ప‌ని అని తేట‌తెల్లం అయింది. తేనెలొలుకు తెలుగుకు ఈ తెగులేంటి అని అంటోంది టీడీపీ.

ప్ర‌సంగాల్లో ఎవ్వ‌రూ త‌ప్పులు ప‌ల‌కాల‌ని అనుకోరు. కొన్ని సార్లు అలా త‌ప్పులు పోతుంటాయి. వాటినే రాద్ధాంతం చేయాలా అని ఎదురు ప్ర‌శ్నిస్తోంది వైసీపీ. ఇదంతా ఎక్క‌డో కాదు ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఇవాళ చోటుచేసుకున్న ప‌రిణామం.

నాలుగో సారి వ‌రుస‌గా రైతు భ‌రోసా అందిస్తున్న త‌రుణాన అక్కడి రైతుల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ మాట్లాడారు. రైతుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూనే, ప్ర‌సంగంలో భాగంలో ప‌ట్టాదారు పాసు పుస్త‌కం అన్న ప‌దం ఒక‌టి కాదు రెండు కాదు మూడు సార్లు త‌ప్పు ప‌లికారు. ఇదే ఇప్పుడు ప‌దే ప‌దే ట్రోల్ అవుతోంది.

గ‌తంలోనూ ఆయ‌న తెలుగు ప‌దాల ఉచ్ఛార‌ణ‌లో త‌ప్పులు ప‌ట్టారు టీడీపీ నాయ‌కులు. ఏకంగా ఇర‌వైకి పైగా ప‌దాలు ఆయ‌న త‌ప్పులు ప‌లికారు అని ఓ పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు ఆ పార్టీ నాయ‌కులు. ఆ విధంగా టీడీపీ నాయ‌కుల క‌ళ్ల‌కూ చెవుల‌కూ మ‌రియూ నోటికీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ని చెబుతూనే ఉన్నారు జ‌గ‌న్.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ తెలుగు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్య‌మంత్రి తెలుగు ప‌దాల ఉచ్ఛార‌ణ‌లో ఇంగ్లీషు యాంక్సెంట్ ను కొన్నిసార్లు జోడిస్తూ ప‌ల‌క‌డం కూడా ఆశ్చ‌ర్య‌క‌రం.

వీటిని దిద్దుకోవాల‌ని ఎన్నో సార్లు ఎందరో విన్న‌వించారు ఆయ‌న‌కు. మ‌రి !ఇవాళ కూడా ఆయ‌న టంగ్ స్లిప్ అయింది. ప‌దాలు త‌ప్పులు పోయాయి. ఏదేమ‌యినా భాష ప‌లికే తీరు అన్న‌ది ఓ ఉన్న‌త ప్రామాణిక రీతికి ద‌గ్గ‌ర‌గా ఉండాలి. మాండ‌లిక ప్ర‌ధాన ప‌దాలు అయినా బాగానే ప‌ల‌కాలి. లేదంటే త‌ప్పులు ప‌ట్టుకుని విప‌క్షం అనే కాదు ఎవ్వ‌ర‌యినా వీటి గురించే మాట్లాడ‌తారు. సంస్క‌ర్త అన్న ప‌దాన్ని జ‌గ‌న్ ఓ సంద‌ర్భంలో స‌స్క‌ర్త అని ప‌లికారు. గుంటూరు అన్న ప‌దాన్ని గుండూరు అని ప‌లికారు.

ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే గ‌త ఏడాది ఆయ‌న వివిధ సంద‌ర్భాల్లో ఎన్నో మంచి ప‌దాల‌ను త‌ప్పుగా ప‌లికి ట్రోలర్స్ కు చిక్కారు. ఇక‌పై ఆయ‌న మంచి భాష‌కు మంచి ప‌లుకుకు పలుకుబ‌డికి ప్రాధాన్యం ఇస్తే తెలుగు జీవ‌గ‌తం అయి ఉంటుంది. ఆంధ్రులంతా ఆనందిస్తారు.