Begin typing your search above and press return to search.

మోడీ బీపీ పెంచేసిన త్రిపుర సీఎం.. ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   8 Jan 2023 3:33 PM GMT
మోడీ బీపీ పెంచేసిన త్రిపుర సీఎం.. ఏమ‌న్నారంటే!
X
బీజేపీ సొంత నేత‌, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. ఆయ‌న ఏం మాట్లాడినా.. సంచ‌ల‌నం అవుతుంది. బ‌హుశ ఈ విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దని అనుకోలేం. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న బీజేపీకి మేలు చేస్తున్నామ‌ని అనుకున్నారో.. లేక‌.. మ‌రేమ‌నుకు న్నారో తెలియ‌దు కానీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కి బీపీ పెంచేసే కామెంట్లు చేశారు. ఆయ‌నే త్రిపుర ముఖ్య‌మంత్రి మాణిక్ సాహా. గ‌త ఏడాది మేలో సీఎం గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న తాజాగా బీజేపీపై చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రాల‌ను అందించాయి.

ఇంత‌కీ సాహా ఏమ‌న్నారంటే...``బీజేపీని పవిత్ర గంగానది. అందులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలిగి పోతాయి`` అని వ్యాఖ్యానించారు. పాపాలు కడిగేసుకోవాలంటే బీజేపీలో చేరాలన్నారు. సౌత్ త్రిపురలోని కాకర్‌బన్‌లో జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ఈ నెల‌ 5న జన్ విశ్వాస్ ర్యాలీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు.

జన్‌విశ్వాస్ ర్యాలీని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ఈ ఏడాది జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని గంగానదితో పోలుస్తూ, స్టాలిన్, లెలిన్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న వారు బీజేపీలో చేరాలని పిలుపునిస్తారు. ''రైలు బోగీల్లో ఇంకా ఖాళీలున్నాయి. ఖాళీ బోగీల్లో కూర్చోండి. ప్రధానమంత్రి నేరంద్ర మోడీ మనం చేరాల్సిన గమ్యానికి చేరుస్తారు'' అని అన్నారు.

విపక్ష సీపీఎంపై విమర్శలు చేస్తూ, కమ్యూనిస్టుల హయాంలో ప్రజాస్వామ్యం ఉండదని, ఎందుకంటే వారు హింస, టెర్రర్ టాక్టిక్స్‌ను నమ్ముతారని అన్నారు. ప్రజల ప్రజాస్వామిక హక్కులను తుంగలో తొక్కుతూ ఏళ్ల తరబడి వాళ్లు త్రిపురను పాలించారని అన్నారు. దక్షిణ త్రిపుర జిల్లాలో వామపక్షాల హయాంలో 68 మంది విపక్ష నేతలు హత్యకు గురయ్యారని, ఇందుకు కాకబర్‌బన్‌ కూడా మినహాయింపు కాదని చెప్పారు.

ఇదిలావుంటే, బీజేపీని గంగా న‌ది గా పో ల్చ‌డం వ‌ర‌కు బాగా నే ఉన్న‌ప్ప‌టికీ.. ఈ పార్టీలో చేరితో తప్పులన్నీ ఒప్పులవుతాయని మాణిక్ సాహా చెప్పడంపై విప‌క్షాలు నిప్పులు చెరుగుతున్నాయ‌ని. ఇది నిజ‌మే.. ఎన్నో సీబీఐ కేసులు ఎదుర్కొన్న నాయ‌కులు..బీజేపీలో చేర‌గానే ఆయా కేసుల ఊసు లేకుండా పోతోంద‌ని.. ఆ పార్టీలో చేర‌క ముందు అక్ర‌మార్కులు అన్న‌వారిని.. పార్టీలో చేరిన త‌ర్వాత‌.. పుణ్యాత్ములుగా ట్రీట్ చేస్తున్నార‌ని.. కాంగ్రెస్ దుయ్య‌బ‌ట్టింది.