Begin typing your search above and press return to search.

ముద్దు సీన్ పై స్పందించిన తృణమూల్ మహిళా ఎంపీ

By:  Tupaki Desk   |   27 Nov 2020 9:30 AM IST
ముద్దు సీన్ పై స్పందించిన తృణమూల్ మహిళా ఎంపీ
X
సోషల్ మీడియాలో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో సెన్సార్ లేకుండా ఏమైనా పెట్టుకోవచ్చు అని నిర్వాహకులు హద్దులు మీరి కంటెంట్ తీస్తున్న వైనంపై విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.

ఇటీవల నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ‘ఏ సూటెబుల్ బాయ్ సిరీస్’లో గుడిలో ముద్దు సన్నివేశంపై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో కేసు కూడా నమోదు చేశారు. లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. హిందూ సంప్రదాయాలను , ఆచారాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఆ దృశ్యాల్ని తొలగించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు.

అయితే తాజాగా తృణమూల్ మహిళా ఎంపీ మహువా మొయిత్రి మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థకు మద్దతు తెలుపడం విశేషం. అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది. గుడిపైన అంత పెద్దగా ఉన్న బూతు బొమ్మల కంటే ఇది పెద్ద తప్పుగా కనిపిస్తుందా అని ఆమె వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ లో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని కామెంట్ చేశారు. ప్రతి చిన్న విషయానికి బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడింది.ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించింది.

నెట్ ఫ్లిక్స్ కంటెంట్ దుమారం రేపడంతో బీజేవైఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ‘కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్, డైరెక్టర్ పై కేసు నమోదు చేశారు.

ఆరు భాగాలుగా వస్తున్న ‘ఏ సూటెబుల్ బాయ్’ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శిస్తున్నారు. మీరానాయక్ దర్శకులు.