Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ.. అదిరిపోయే వ్యూహం..

By:  Tupaki Desk   |   3 Oct 2020 10:16 AM IST
ఏపీ బీజేపీ.. అదిరిపోయే వ్యూహం..
X
ఏపీ బీజేపీని వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి తీసుకురావాలి. కుదిరితే.. ఒంట‌రి, లేకుంటే పొత్తుతో అయినా.. పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌నేది నాయ‌కుల వ్యూహం. ఈ క్ర‌మంలోనే పార్టీ త‌ర‌ఫున అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా హిందూ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన దేవాల‌యాల‌పై దాడుల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ నాయ‌కులు ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపించారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా నెల‌కొన్నా.. వ‌ర్గ పోరును క‌ట్ట‌డి చేయ‌డం.. అసంతృప్తుల‌ను దారిలో పెట్ట‌డం పార్టీకి త‌ల‌కు మించిన ప‌నిగా ఉంది. గ‌తంలో ఏపీ అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ హ‌యాంలోను ఇప్పుడు కూడా.. వ‌ర్గ పోరు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీనిని గ్ర‌హించిన ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. వ‌ర్గ‌పోరును త‌గ్గించ‌డం, సామాజికంగా అన్ని వ‌ర్గాల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌డం అనే ఫార్ములాల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బీజేపీలో అసంతృప్తుల‌ను త‌గ్గించేందుకు, పార్టీని ప‌రుగులు పెట్టించేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు పార్టీ నేత‌లు రెడీ అవుతున్నారని స‌మాచారం.

దీనిలో భాగంగా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌, జిల్లాల‌పై ఆయా సామాజిక వ‌ర్గాల‌కు ఉన్న ప్రాధాన్యం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకునిపార్టీలో నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని, త‌ద్వారా పార్టీ ప‌రుగులు పెట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను కాపు సామాజిక వ‌ర్గంలోని కీల‌క నేత‌ల‌కు అప్ప‌గించ‌డం ద్వారా అక్క‌డ పుంజుకునేందుకు ఉన్న అవ‌కాశాల‌ను అధ్య‌య‌నం చేస్తారు.

ఇక‌, రాజ‌కీయాల్లో అత్యంత కీల‌కంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో క‌మ్మ నేత‌ల‌ను ప్రోత్స‌హించ‌డం, ఇక‌, రెడ్డి వ‌ర్గం డామినేష‌న్ ఉన్న‌ కర్నూలు - కడప - అనంతపురం జిల్లాల్లో రెడ్డివ‌ర్గాన్ని ప్రోత్స‌హించ‌డం ద్వారా పార్టీని అభివృద్ధి బాట‌లో న‌డిపించాల‌ని రాష్ట్ర క‌మ‌ల నాథులు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. వ్యూహం అదిరిపోయేలా ఉన్న‌ప్ప‌టికీ.. అమ‌లు ఏమేర‌కు ముందుకు సాగుతుందో చూడాలి.