Begin typing your search above and press return to search.
టీచర్లు, నిరుద్యోగులకు షాక్.. జీవో 317 పై హైకోర్టులో విచారణ
By: Tupaki Desk | 30 Dec 2021 5:04 PM ISTతెలంగాణలో కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన కొత్త జీవో వివాదాస్పదంగా మారింది. ఆ జీవోను తక్షణం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరుద్యోగులు సైతం ఆ జీవో పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన జీవోనంబర్ 317 వివాదాస్పదంగా మారింది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. బీఆర్కే భవన్ ను కూడా ముట్టడించేందుకు ప్రయత్నించాయి. బీసీ సంఘాల నేతలు కూడా నిన్న ఉన్నతాధికారులను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జీవోనంబర్ 371ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నిరుద్యోగులు సైతం ఈ జీవో నంబర్ 317 ద్వారా తీవ్రంగా నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ జీవో నంబర్ 317 వివాదాస్పదం కావడానికి కారణాలు ఉన్నాయి. జిల్లాలో విభజనలో కొన్ని మండలాలు వేరే ఉమ్మడి జిల్లాలోకి వెళ్లాయి. ఇప్పుడు సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేస్తే వారు కొత్త జిల్లాలో మారుమూలకు వెళుతున్నారు. దాన్నే ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ క్రమంలోనే జీవోనంబర్ 317పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ జీవోను పార్లమెంట్ లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని కోర్టుకు పిటీషనర్ తెలిపారు. ఈ జీవోపై స్టే ఇవ్వాలని కోరారు.
అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ స్టే ఇవ్వడానికి నిరాకరించారు. ప్రతివాదుల వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు, విభాగాల అధికారులు, కలెక్టర్లకు నోటీసులు జారీ చేశారు.
టీచర్ల కేటాయింపులనకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం హేతుబద్దంగా లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ స్పందించి సీనియరిటీ విధానాన్ని పక్కనపెట్టి కొత్త విధానం తీసుకురావాలని టీచర్లు, నిరుద్యోగులు కోరుతున్నారు.