Begin typing your search above and press return to search.

టెంప్టింగ్ చేస్తున్న నా ఇటుక.. నా అమరావతి

By:  Tupaki Desk   |   16 Oct 2015 6:05 AM GMT
టెంప్టింగ్ చేస్తున్న నా ఇటుక.. నా అమరావతి
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐడియానే ఐడియా. నోటి మాటతోనే కాదు.. చేతలతో కూడా తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సీమాంధ్రులంతా కదలిరావాలని.. ప్రతి ఒక్కరూ ఒక్క ఇటుకకైనా తమ వంతుగా దానం చేయాలని.. అమరావతి నిర్మాణం సీమాంద్ర ప్రజల భాగస్వామ్యంలో జరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

దీనికి తగ్గట్లే http://amaravati.gov.in/index.aspx పేరిట వెబ్ సైట్ ను స్టార్ట్ చేశారు. ఒక్కో ఇటుక రూ10 చొప్పున విరాళం ఇచ్చే వీలుంది. అంటే.. అమరావతి నగరానికి విరాళం ఇచ్చేందుకు రూ.10 నుంచి మొదలు పెట్టొచ్చన్న మాట. ఇచ్చేది పది రూపాయిలే అయినప్పటికీ అమరావతిలో భాగస్వామిగా గుర్తిస్తూ పేర్కొనటం సంతోషాన్ని ఇవ్వటమే కాదు.. మరింత సాయం ఇవ్వాలన్న భావన కలిగేలా సైట్ డిజైన్ చేశారు.

అంతేకాదు.. భారీగా విరాళం ఇచ్చే వారికి సంబంధించిన ఫోటోల్ని కూడా ప్రచురించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక.. విరాళం ఇచ్చే ప్రతిఒక్కరి పేరు వెబ్ సైట్ లోనమోదు కావటమే కాదు.. వారికి కనిపించే అవకాశం ఉండటంతో.. విరాళాలు ఎంత వచ్చాయి. ఎంతమంది.. ఎంత ఇచ్చారన్న విషయంతో పాటు.. ఏ ప్రాంతానికి చెందిన వారు ఇచ్చారో కూడా తెలుస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్టార్ట్ అయిన ‘‘నా ఇటుక నా అమరావతి’’ వెబ్ సైట్లో ఇటుకల విరాళం జోరుగా సాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఈ వెబ్ సైట్ ద్వారా 4937 మంది 4,40,392 ఇటుకల్ని ఇచ్చారు.

అత్యధికంగా విరాళం ఇచ్చిన వారి విషయానికి వస్తే.. ఏపీ క్రెడాయ్ విరాళంగా ఇచ్చిన 52,200 ఇటుకల్ని ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు కాకుంటే.. ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం 10,116 ఇటుకలు ఇచ్చిన క్రెడాయ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకలు.. డాక్టర్ శ్రీనివాస్ గుళ్లపల్లి 5000 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు.

అంతేకాదు.. ఒక్క ఇటుకకు విరాళం ఇచ్చినా తాజాగా విరాళం ఇచ్చిన వారి పేర్లను స్క్రోలింగ్ ఇవ్వటం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇలా పేర్లు.. ఫోటోలు కూడా కనిపించేలా ఉన్న ‘‘నా ఇటుక నా అమరావతి’’ సైట్ చూసిన వెంటనే విరాళం ఇచ్చేలా టెంప్ట్ చేస్తుందనటంలో సందేహం లేదు.