Begin typing your search above and press return to search.

పుట్టగొడుగులతో కరోనాకు చికిత్స! పూటకో అధ్యయనం రోజుకో మందు..

By:  Tupaki Desk   |   21 Oct 2020 9:30 AM IST
పుట్టగొడుగులతో కరోనాకు చికిత్స!  పూటకో అధ్యయనం రోజుకో మందు..
X
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న ఓ మహమ్మారి. అ వ్యాధితో యావత్​ ప్రపంచమే మునిగిపోయే పరిస్థితి నెలకొన్నది. దీంతో కరోనాపై పూటకో అధ్యయనం బయటకు వస్తుంది. వ్యాక్సిన్లు, మందులపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో పరిశోధన బయటకొచ్చింది. పుట్టగొడుగులతో కరోనాను నియంత్రించవచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజానికి పుట్టగొడుగులను ఆహారంగా వినియోగిస్తారు. ఇందులో అనేక పోషకాలు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లతో యాంటీ వైరల్ ఫుడ్ ను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

పుట్టగొడుగుల్లో ఉండే కార్డిసెప్స్, కర్కమిన్ లను వినియోగించి ద్రవరూపంలో ఉండే ఫుడ్ సప్లిమెంట్ ను వారు తయారు చేస్తున్నారట. భోపాల్, నవీ ముంబై, నాగపూర్ లోని ఎయిమ్స్ లో దీనిపై ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే త్వరలోనే ద్రవరూపంలో ఉండే ఫుడ్ సప్లిమెంట్ అందుబాటులోకి వస్తుంది. కరోనా వాక్సిన్ ఆలస్యమైనా ఈ ద్రవరూపంలో ఉండే ఫుడ్ సప్లిమెంట్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ద్రవ రూపంలో ఉండే ఫుడ్​ సప్లిమెంట్ కరోనాను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.