Begin typing your search above and press return to search.

అవతార్‌ కార్ : 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 700కిమీ ప్ర‌యాణం…

By:  Tupaki Desk   |   17 Sept 2021 3:00 PM IST
అవతార్‌ కార్ :  15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 700కిమీ ప్ర‌యాణం…
X
అవతార్‌ సినిమా స్ఫూర్తిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌.. ‘విజన్‌ అవతార్‌’ పేరిట ఒక కొత్త కాన్సెప్ట్‌ కారును రూపొందించింది. డ్రైవింగ్‌ సీటులో కూర్చున్న వ్యక్తి కారును తన ఆలోచనలతోనే నియంత్రించగలడు. ఇదీ ఆ కారు ప్రత్యేకత. డ్రైవర్‌ తన మనసులో ఏసీ ఆన్‌ అవ్వాలను కుంటే ఆన్‌ అయిపోతుంది. పాటలు వినాలనుకుంటే ఆడియో ఆన్‌ అవుతుంది. అంతే కాదు.. ఈ కారు 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్‌ అవుతుంది.

ఒక్కసారి చార్జ్‌ చేస్తే 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. కారు బ్యాటరీని గ్రాఫీన్‌ టెక్నాలజీతో తయారుచేశారు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని ఈ కారును బెంజ్‌ సంస్థ మ్యూనిక్‌ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తోంది. హైఎండ్ టెక్నాల‌జీతో కార్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ను కార్ల త‌యారీతో వినియోగిస్తున్నారు. మ‌నం మ‌నసులో ఏమ‌నుకుంటామో ఆ విధంగా కారు మారిపోతుంది. ఈ కారును మ్యూనిక్ న‌గ‌రంలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఆటోమోబైల్ ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ కారు బ్యాట‌రీని ఒకసారి రీచార్జ్ చేస్తే 700 కిమీ దూరం ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఆ కారు బ్యాట‌రీని గ్రాఫిన్ టెక్నాల‌సీతో రూపొందించారు. ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హానీ ఉండ‌ద‌ని మెర్సిడెజ్ బెంజ్ సంస్థ పేర్కొన్న‌ర‌ది.