Begin typing your search above and press return to search.

చైనీయుల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా నిషేధాజ్ఞ‌లు!

By:  Tupaki Desk   |   2 Feb 2020 10:24 PM IST
చైనీయుల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా నిషేధాజ్ఞ‌లు!
X
క‌రోనా వైర‌స్ కు మూల కార‌కులుగా నిలుస్తున్న చైనీయుల‌ను చూస్తూనే ప్ర‌పంచం భ‌య‌ప‌డుతూ ఉన్న‌ట్టుంది. ఇప్ప‌టికే చైనాలో కరోనా బాధిత మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. అలాగే మ‌రి కొంద‌రికి ఈ వైర‌స్ సోకిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. చైనా నుంచినే ఈ వైర‌స్ ఇత‌ర దేశాల‌కు పాకుతూ ఉంద‌ని కూడా స్ప‌ష్టం అవుతూ ఉంది. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇద్ద‌రు కేర‌ళ వ్య‌క్తుల్లో క‌రోనా ల‌క్ష‌ణాల‌ను గుర్తించారు. వారిద్ద‌రూ కూడా ఇటీవ‌లి కాలంలో చైనా వెళ్లి వ‌చ్చిన వాళ్లే. ఈ నేప‌థ్యంలో చైనా టూర్ అంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి త‌లెత్తుతూ ఉంది.

ఈ ప‌రిణామాల్లో ప‌లు దేశాలు చైనా నుంచి వ‌చ్చే వారిపై నిఘా ఉంచాయి. చైనా నుంచి వ‌చ్చిన వారిని త‌ప్ప‌నిస‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచిస్తూ ఉన్నారు. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరులో ఒక కుటుంబం మొత్తం ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన‌ట్టుగా తెలుస్తోంది. వీరు ఇటీవ‌లే చైనాలో ప‌ర్య‌టించి వ‌చ్చార‌ట‌. చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉండ‌టంతో వీరు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టుగా స‌మాచారం. అయితే వారికి క‌రోనా భ‌యం లేద‌ని తేలింద‌ని తెలుస్తోంది.

అదలా ఉంటే.. చైనా సిటిజ‌న‌ర్స్ కు ఈ వీసా స‌దూపాయాన్ని ర‌ద్దు చేసింది భార‌త ప్ర‌భుత్వం. చైనా సిటిజ‌న్స్ కానీ, చైనా మీద‌కు ఇండియాలోకి వ‌చ్చే విదేశీయుల‌కు కానీ వీసాల మంజూరీని తాత్కాలికంగా ఇండియా ఆపేసింది. అక్క‌డి భార‌తీయుల్లో ఇండియా వ‌చ్చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారిని మాత్రం భార‌త ప్ర‌భుత్వం తీసుకువ‌స్తూ ఉంది.

ఇక ఇదే త‌ర‌హా నిషేధాన్ని విధించింది న్యూజిలాండ్ కూడా. చైనీయులు ఎవ‌రూ త‌మ దేశంలోకి అడుగుపెట్ట‌డానికి వీల్లేద‌ని న్యూజిలాండ్ ప్ర‌క‌టించింది. చైనీయులు కానీ, చైనా నుంచి వ‌చ్చే విదేశీయులు కానీ త‌మ దేశంలోకి రావ‌డానికి వీల్లేద‌ని న్యూజిలాండ్ ప్ర‌క‌టించింది. అయితే ఇది 14 రోజుల వ‌ర‌కూ ఉండే నిబంధ‌న అని పేర్కొంది. క‌రోనాపై తాడోపేడో తేలేంత వ‌ర‌కూ న్యూజిలాండ్ ఈ నిషేధాజ్ఞ‌ల‌ను విధించింది. మొత్తానికి చైనా మూలాలే క‌రోనా వైర‌స్ భ‌యాల‌ను వ్యాప్తిచేస్తున్న‌ట్టుగా ఉన్నాయి.