Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ రజినీకాంత్ కు షాకిచ్చిన ట్రాన్స్ జెండర్లు

By:  Tupaki Desk   |   14 April 2020 7:30 AM GMT
లాక్ డౌన్ వేళ రజినీకాంత్ కు షాకిచ్చిన ట్రాన్స్ జెండర్లు
X
లాక్ డౌన్ తో దేశమంతా ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. బయటకొచ్చిన వారిని పోలీసులు తన్ని తరిమేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి సినీ - రాజకీయ సెలెబ్రెటీల వరకు ఇంటి నుంచి కాలు బయటపెట్టడం లేదు.

అయితే తాజాగా సడన్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి ఎదుట ధర్నా జరిగింది. చేసింది ఎవరో కాదు.. 8 మంది గ్రూపుగా గల ట్రాన్స్ జెండర్లు. గ్రూపుగా వచ్చిన వీరంతా రజినీకాంత్ ఇంటి ముందు హల్ చల్ చేయడం దుమారం రేపింది.

కరోనా వైరస్ నేపథ్యంలో ఫెఫ్సీ వర్కర్లకు రజినీకాంత్ రూ.50 లక్షల సాయం ప్రకటించారు. ఈ నేపథ్యం లోనూ ఉపాధి లేకుండా అలమటిస్తున్న ట్రాన్స్ జెండర్లకు కూడా రజినీకాంత్ విరాళాలు ఇవ్వాలని ఆయన ఇంటి ఎదుట మూకుమ్మడిగా వచ్చి ధర్నా నిర్వహించారు.

రజినీకాంత్ తోపాటు కుటుంబ సభ్యులు ఇది చూసి షాక్ కు గురయ్యారు. ఆ తరువాత రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ వారికి రూ.5వేలు ఇవ్వగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

దీనిపై పోలీసులను వివరణ కోరగా.. రజినీకాంత్ ఇంటి ఎదుట ధర్నా జరిగిందని.. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.