Begin typing your search above and press return to search.
ఇంత భారీగా బదిలీలు ఎందుకంట కేసీఆర్?
By: Tupaki Desk | 3 Feb 2020 10:06 AM ISTబదిలీలు మామూలే. అయితే.. అన్ని బదిలీలు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు చేసేలా తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ముఖ్య మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంత భారీగా.. ఒకేసారి యాభై మందిని టోకుగా ట్రాన్సఫర్ లు చేసి సంచలనంగా మారారు సీఎం కేసీఆర్. సీనియర్.. జూనియర్ అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున అధికారుల్ని బదిలీలు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ుంటే.. అందులో 21 జిల్లాలకు కొత్త కలెక్టర్ల ను నియమించటం చూస్తే.. పాలనా పరమైన ప్రక్షాళనను మొదలు పెట్టారా? అన్న సందేహం కలుగక మానదు. సీనియర్ ఐఏఎస్ లను కూడా మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వివిధ శాఖల్లో దీర్ఘ కాలంగా పని చేస్తున్న వారిని ప్రభుత్వం మార్చేసింది. ఓ పక్క కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ లను బదిలీలు చేయటం వెనుకున్న అసలు కారణం ఏమిటన్న దాని పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
బదిలీలు చేసిన వారిలో ఆరుగురికి పోస్టింగులు ఇవ్వకపోవటం ఒక విశేషమైతే.. పలువురు ఐఏఎస్ లను కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. జీహెచ్ ఎంసీలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు ఐఏఎస్ లను వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరోఅంశాన్ని ప్రస్తావించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పని చేస్తూ కీలకమైన అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికల్ని నిర్వహించిన రజత్ కుమార్ ను ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి గా బదిలీ చేయటం గమనార్హం.
పట్టణ పరిపాలన విషయం లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజా బదిలీలు చూస్తే.. మున్సిపల్ కమిషనర్లు గా.. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు గా 2014-16 బ్యాచులకు చెందిన యువ ఐఏఎస్ లను నియమించటం ఆసక్తికరంగా మారింది. నిజాంపేట లాంటి కార్పొరేషన్ కు కమిషనర్ గా ఒక ఐఏఎస్ ను నియమించటం మరో విశేషం.