Begin typing your search above and press return to search.
రైలు ఢీకొని 400 గొర్రెల దుర్మరణం
By: Tupaki Desk | 24 Oct 2017 11:00 PM ISTపాడిపంటలను నమ్ముకున్న వారికి అకస్మాత్తుగా విపత్తు ఎదురైతే ఎంతటి షాక్‌కు గురవుతారనేందుకు ఇదే ఉదాహరణ. యాదాద్రి భువనగిరిజిల్లాలోని రామన్నపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఓ యాదవ సోదరుడు తన 400 గొర్రెలను కోల్పోయాడు. గొర్రెల మంద ట్రాక్ దాటుతున్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ఆ రైతు కుప్పకూలిపోయాడు.
గొర్రెలు ట్రాక్ ను దాటుతున్న సమయంలో ఫలక్ నుమా రైలు రావడంతో వేగంగా వాటిపై నుంచి దూసుకుపోవడం వల్ల దాదాపు 400 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ట్రాక్ చుట్టూ గొర్రెల కళేబరాలు పడిపోవడాన్ని చూసి వాటి యజమాని దిగ్బ్రాంతి కి లోనయ్యాడు. చనిపోయిన తన గొర్రెల విలువ దాదాపు పది లక్షలు ఉంటుందని ఆయన వాపోయాడు. తనకు న్యాయం చేయాలని రైల్వే అధికారులను వేడుకుంటున్నాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
