Begin typing your search above and press return to search.
గుంటూరులో దారుణం: భర్తను బెదిరించి మహిళ పై ..!
By: Tupaki Desk | 9 Sept 2021 1:46 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. భార్య భర్తలు కలిసి బైక్ మీద వెళుతున్న క్రమంలో దంపతులను కత్తులతో బెదిరించి దాడి చేసిన దుండగులు ఆపై మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఘటన గురించి వివరాల్లోకి వెళ్తే .. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఒక వివాహానికి హాజరై బైక్ పై వెళ్తుండగా ఊహించని విధంగా జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.
బుధవారం రాత్రి మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఓ పెళ్లికి హాజరై బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను కత్తులతో బెదిరించి భార్యను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సంఘటన జరిగిన అనంతరం బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాదని గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని సత్తెనపల్లి పోలీసులు చెప్పారు. తమ స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉందని పోలీసులు తెలిపారు. దీంతో బాధితులు వెనుదిరిగి మేడికొండూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అసలే దుండగుల దాడి, ఆపై సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మహిళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే సంఘటన ఎక్కడ జరిగినప్పటికీ జీరో ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే అలా చేయకుండా జీరో ఎఫ్ ఐ ఆర్ బుక్ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ బాధితులను వెనక్కు తిప్పి పంపిన పోలీసులపై ప్రస్తుతం విమర్శలు వెల్లువగా మారాయి. సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని వెంటనే మేడికొండూరు పోలీసులను అలెర్ట్ చేసి ఉంటే బాధిత మహిళ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులను త్వరితగతిన పట్టుకోవడానికి అవకాశం ఉండేది. అలా కాకుండా కేసు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
బాధితులను అటూ ఇటూ తిప్పి ఫిర్యాదు తీసుకోవడానికి జాప్యం చేయడంతో నిందితులు తప్పించుకొని పోయే అవకాశం లేకపోలేదని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో నడిరోడ్డు మీద భార్యాభర్తలు కలిసి వెళ్లే పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా పోయాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ పాలనలో దారుణంగా హత్యలకు పాల్పడిన వాళ్లు, రేప్ చేసిన మృగాళ్ళు జైల్లో ఉండరు. యధేచ్చగా బెయిల్ పై బయటకు తిరుగుతుంటారు. వారిని కఠినంగా శిక్షించే పరిస్థితి కానీ, వారిపై చర్యలకు ఉపక్రమించే వ్యవస్థ గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు, అత్యాచార ఘటనలు, గ్యాంగ్ రేప్ లు విపరీతంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి.