Begin typing your search above and press return to search.
వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి
By: Tupaki Desk | 20 Nov 2021 9:13 AM ISTగుండెపోటుతో ఎమ్మెల్సీ మృతిచెందడంతో అధికార వైసీపీలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంవత్సరం మార్చిలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటనతో విజయవాడ వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గతంలో కరీమున్నీసా విజయవాడ కార్పొరేషన్ లో 56వ డివిజన్ కు కార్పొరేటర్ గా కూడా పనిచేశారు. అయితే నిన్న రాత్రి అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్లు ఎంత చికిత్స అందించినా ఆమెకు గుండెపోటు అధికం కావడంతో తుదిశ్వాస విడిచారు. నిన్న అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరైన కరీమున్నీసా ఇలా మరణించడంతో వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కరీమున్నీసా మృతి పట్ల వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీఎం జగన్ ఆమెకు మృతికి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.