Begin typing your search above and press return to search.

స్నానం చేస్తుండగా వీడియో తీసి బాలికపై అఘాయిత్యం ..గర్భం దాల్చిన అమ్మాయి !

By:  Tupaki Desk   |   3 Jun 2020 12:20 PM IST
స్నానం చేస్తుండగా వీడియో తీసి బాలికపై అఘాయిత్యం ..గర్భం దాల్చిన అమ్మాయి !
X
ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ మైనర్ బాలిక స్నానం చేస్తున్న సమయంలో అశ్లీలత దృశ్యాలను చిత్రీకరించి, లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. చీపురుపల్లి పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు కన్నేశాడు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీశాడు. వాటిని ఆమెను చూపించి తన కోరిక తీర్చకపోతే బయటపెడతానని బెదిరించాడు. దీనితో ఆ వీడియో బయటకి వస్తే ఎక్కడ తన పరువు పోతుందో అని అతడికి లొంగిపోయింది.

ఇదే అదునుగా భావించి దాన్ని అవకాశంగా చేసుకున్న ఆ కామాంధుడు బాలికపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె తన కూతురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా రెండు నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఆమె చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం బొబ్బిలి ఇన్ ‌ఛార్జి డీఎస్పీ పాపారావు.. సీఐ రాజులనాయుడు, ఎస్ ‌ఐ దుర్గాప్రసాద్ ‌లతో కలిసి గ్రామానికి చేరుకొని విచారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును తానే స్వయంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు.