Begin typing your search above and press return to search.

కొమురం భీం జిల్లా లో విషాదం ...పులి దాడి లో మరొకరు బలి

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:10 PM IST
కొమురం భీం జిల్లా లో విషాదం ...పులి దాడి లో మరొకరు బలి
X
కొమురం భీం జిల్లా లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా లో పులి దాడి లో ఓ మహిళ మృతి చెందింది. పెంచిక‌ల్‌పేట మండ‌లం కొండ‌ప‌ల్లి గ్రామంలో నిర్మ‌ల‌ బాలిక‌పై పెద్ద‌పులి దాడి చేసి చంపేసింది. ఆదివారం ఉద‌యం తోటి కూలీల‌తో క‌లిసి బాలిక గ్రామానికి స‌మీపంలో ఉన్న‌ చేనులోకి ప‌త్తి ఏర‌డానికి పనికి వెళ్లింది. అక్కడ చెనులో ప‌త్తి ఏరుతుండ‌గా మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌పులి క‌నిపించ‌డంతో కూలీలు అంద‌రూ ప్రాణ భయంతో అహకారాలు చేస్తూ అక్కడి నుండి ప‌రుగులు తీశారు.

అయితే , అక్క‌డ ఉన్న నిర్మ‌ల అనే బాలిక ‌పై పులి దాడి చేయ‌డంతో బాలిక అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రిపై దాడి చేసి చంపేయ‌డంతో అట‌వీ గ్రామాల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. కాగా, మహారాష్ట్ర ,తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో కూడా రెండు రోజుల క్రితం కూడా పెద్ద‌పులి ఒక‌రిని చంపేసింది. ఇక గత 11 న దహేగం మండలం దిగడలో ఓ యువకుడిని పులి దాడి చేసి గాయాలపాలు చేసింది. అయితే , ఆ ప్రదేశానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో , ఈ దాడి కి పాల్పడింది కూడా ఆ పులినేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.