Begin typing your search above and press return to search.

ఏపీలో విషాదం.. కరోనా వైరస్ అనుమానం తో రైతు ఆత్మహత్య

By:  Tupaki Desk   |   12 Feb 2020 11:00 AM IST
ఏపీలో విషాదం.. కరోనా వైరస్ అనుమానం తో రైతు ఆత్మహత్య
X
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ కరోనా వైరస్ చైనా నుండి ఇప్పటికి 25 దేశాలకి వ్యాప్తి చెందింది. చైనాలో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసులు 42వేలుగా అధికారులు ధ్రువీకరించారు. 24 ఇతర దేశాల్లో మొత్తంగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. అయితే, ఈ కరోనా వైరస్ పట్ల సరైన అవగాహాన లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిన మాట విని కరోనా వైరస్ అనుకుని భయంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో బాలకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాలు చూస్తే .. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణకు గుండె దడగా ఉండటంతో పరీక్షల కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షల అనంతరం అతనికి వైరల్ ఫీవర్ రావటం తోటే జ్వరం, దగ్గు వచ్చిందని, దానివల్ల గుండె కొంచెం దడగా ఉందని చెప్పి రెండు రోజుల పాటు చికిత్స అందించి డాక్టర్లు ఇంటికి పంపించారు.

ఆదివారం ఫిబ్రవరి9వ తేదీ సాయంత్రానికి స్వగ్రామ చేరుకున్న బాలకృష్ణ తనకు కరోనా వైరస్ సోకిందని ఎవరూ తన వద్దకు రావద్దని, ముట్టుకోవద్దని చెప్పి అందరికీ దూరంగా ఉండసాగాడు. తన దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో తరిమి కొట్టి గదిలోకి వెళ్ళి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు పోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు అని స్థానికులు ఆరోపించారు. . ఆ తరువాత సోమవారం తెల్లవారు జామున బాలకృష్ణ గదిలోంచి.. తాళం తీసుకుని బయటకు వచ్చితన పొలానికి వెళ్లాడు. అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్నచెట్టుకు ఉరేసుకుని ఆత్య హత్య చేసుకున్నాడు. మృతుడికి గుండె, కాలేయ సమస్యలు ఉన్నాయని , ఈ నేపథ్యంలోనే వైరల్ ఫీవర్ రావడంతో , కరోనా ఉందనే అపోహతోనే చనిపోయాడని వైద్యులు చెప్పారు. బాలకృష్ణ మృతితో శేషమనాయుడుకండ్రిగ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే , రాష్ట్రంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు అని ,ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.