Begin typing your search above and press return to search.

బీజేపీ మాజీ అధ్యక్షుడి ఇంట్లో విషాదం ... నలుగురు ఆత్మహత్య !

By:  Tupaki Desk   |   22 Feb 2021 5:00 PM IST
బీజేపీ  మాజీ అధ్యక్షుడి ఇంట్లో విషాదం ... నలుగురు ఆత్మహత్య !
X
రాజస్థాన్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకి పాల్పడ్డారు. దీనితో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై సంచలనం సృష్టిస్తుంది.

అగ్రనేతకి చెందిన కుటుంబం లో ఒకేసారి నలుగురు ఆత్మహత్య చేసుకోవటంపై పెద్ద ఎత్తున విషాదం వ్యక్తమవుతోంది. మదన్ లాల్ కొడుకు వరుస అయిన హనుమాన్ ప్రసాద్‌ తో సహా నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మ‌ృతి చెందారు. హనుమాన్ ప్రసాద్ స్వయాన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీకి సోదరుని కుమారుడు అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ మద్యే హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు మృతిచెందాడు. దీంతో ఇంటిలోని మిగిలినవారంతా మానసిక వ్యథకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిని హనుమాన్ ప్రసాద్, అతని భార్య తార, ఇద్దరు కుమార్తెలు అను, పూజలుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సీకర్ జిల్లా ఉద్యోగ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు 2020 సెప్టెంబరులో మృతి చెందాడు. హనుమాన్ ప్రసాద్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత మిగిలిన వారికి బతకాలనే ఆశ లేదని నోట్ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు రాజస్థాన్ లో సంచలనంగా మారింది.