Begin typing your search above and press return to search.

సూరత్ లో ఘోర ప్రమాదం.. ఘటనకు కారణం ఇదేనా..?

By:  Tupaki Desk   |   6 Jan 2022 6:34 AM GMT
సూరత్ లో ఘోర ప్రమాదం.. ఘటనకు కారణం ఇదేనా..?
X
ఉత్తరాదిన ఘోర ప్రమాదం సంభవించింది. గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లో ఓ కంపెనీకి చెందిన ట్యాంకర్ నుంచి వెలువడిన విషవాయువు లీకై ఆరుగురు మరణించారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను హూటాహుటిన న్యూ సివిల్ ఆసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున సూరత్లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన వారిలోనూ కొంతమంది పరిస్థతి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూరత్ లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన కెమికల్ ట్యాంకర్ నుంచి ఈ విష వాయువు వెలువడినట్లు భావిస్తున్నారు. ఈ ట్యాంకర్ నుంచి విష వాయువు వెలువడిన క్షణాల్లోనే సమీపంలో చాలా మంది స్థానికులు స్పృహ కోల్పోయారు. ఈ సంఘటన ప్రాంతంలో విశ్వప్రేమ్ మిల్ లో పనిచేసే కార్మికులు బాధితులు ఎక్కువగా ఉన్నారు. విషవాయివు లీక్ కాగానే విశ్వ ప్రేమ్ మిల్ లో నిద్రిస్తన్న వారంతా ఈ వాయివును పీల్చుకున్నారు. ఉదయ 5 గంటల ప్రాంతంలో దీంతో నిద్రమత్తులో ఉండగా వారికి శ్వాస ఆడకపోవడంతో చాలా మంది కార్మికులు స్పృహ కోల్పోయారని వైద్యులు తెలుపుతున్నారు. కాగా ఈ విషవాయువు వెలువడిన 10 మీటర్ల దూరంలో కార్మికులు నిద్రిస్తున్నారు.

‘సూరల్ లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గ్యాస్ లీక్ కారణంగా ఆరుగురు మరణించగా, మరో 20 మందికి అస్వస్థతకు గురయ్యాయరని’ ఆసుపత్రి ఇన్ చార్జి డాక్టర్ ఓంకార్ చౌదరి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే గ్యాస్ లీక్ కావడానికి కారణాలు, తదితర విషయాలపై పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో ట్యాంకర్ ద్వారా రసాయనాలను డ్రైనేజీలో వదిలి పెడుతుండగా ఈ గ్యాస్ లీకైందని భావిస్తున్నారు. కాగా మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో ఆ సమయంలో ఎక్కువ మంది నిద్రిస్తున్నారు. దీంతో అప్రమత్తం కావాల్సిన సమయం లేకుండా పోయింది. దీంతో చాలా మంది ఈ గ్యాస్ బారిన పడ్డారని అంటున్నారు. చుట్టుపక్కల వారికి ఏం జరుగుతుందో తెలిసే లోపే ఆ ప్రాంతమంతా విషవాయువుతో కమ్మకుపోయింది. అయితే సమాచారం అందుకున్న అంబులెన్స్ లు రెండు అక్కడికి వచ్చి బాధితులను అసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఆరుగురు చనిపోగా 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కానీ వీరిలో చాలా మందికి సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.