Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో: బికినీతో మహిళ.. లాక్కెళ్లిన పోలీసులు

By:  Tupaki Desk   |   10 Feb 2020 6:00 AM GMT
వైరల్ వీడియో: బికినీతో మహిళ.. లాక్కెళ్లిన పోలీసులు
X
బికినీ ధరించిన మహిళ పట్ల మగ పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై బట్టలు లేకున్నా వదిలి పెట్టలేదు. ఆమె ఎంత ప్రతిఘటిస్తున్నా పోలీసులు ఆమె చేతులను వెనక్కి కట్టేందుకు ప్రయత్నించారు. మహిళ పెనుగులాడుతున్న వదలిపెట్టలేదు. వెనక చేతులకు బేడీలు వేస్తూ కొందరు.. ఆమెకు దుస్తులు వేస్తూ మరికొందరు పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు వీడియో ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

బికినీ ధరించిన మహిళ బ్రిటీష్ అమ్మాయి. ఇంగ్లీష్ భాషలోనే మాట్లాడుతోంది.. ఆమె బికినీలో బీచ్ లో సేదతీరుతుండగా.. మాల్దీవుల దేశ పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

మాల్దీవులులోని మాఫుషి ద్వీపంలోని బీచ్ లో ఈ దమనకాండ కొనసాగింది. బికినీతో ఉన్న మహిళను పోలీసులు అమనుషంగా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ‘మీరు నన్ను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు’ అంటూ సదురు మహిళ పోలీసులపై అరవడం కనిపించింది.

ఆ మహిళను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినట్లు మల్దీవుల మీడియా తెలిపింది. ఆమె మద్యం మత్తులో ఉందని చెబుతున్నారు. బికినీ మహిళ అరెస్ట్ కు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మహిళ అని కూడా చూడకుండా మల్దీవుల పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.